38.2 C
Hyderabad
April 29, 2024 13: 04 PM
Slider మహబూబ్ నగర్

చర్యలు తీసుకోవడం మాట దేవుడెరుగు… ఆధారాలే గాయబ్

#kollapurpolice

వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే దళిత జర్నలిస్టు అవుట రాజశేఖర్ పై నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసులు చేసిన దాష్టీకంపై సామాజిక న్యాయ, దర్యాప్తు సంస్థలకు ఆధారాలు దొరక్కుండా కొందరు అధికారులు ‘‘ అన్ని జాగ్రత్తలూ’’ తీసుకుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో గతంలో సీసీ కెమెరా ఫుటేజీలు దాచారు.

ఇప్పుడు అదే  పోలీస్ స్టేషన్ లో బాధితులు పోస్ట్ చేసిన రిజిస్టర్ పోస్టులో పిర్యాదు, ఎవిడెన్స్ గోల్మాల్ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే గత  మే నెలలో దళితుడైన  రిపోర్టర్ అవుట రాజశేఖర్ పై  కొందరు దాడియత్నం చేశారు.

ఫోన్ లో అసభ్యంగా దూషించి జర్నలిస్టు వృత్తిని  అవమాన పరిచారు. అంతేకాదు మరుసటి రోజు ఇద్దరు కలిసి ఇంటి పైకి ఏకంగా దాడికి  తెగబడ్డారు. చంపుతాము అంటూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులను గురి చేశారు.  ఈ ఘటనలను వీడియో తీయడంతో  వెలుగులోకి వచ్చాయి.

అంతే కాదు వాట్సాప్ గ్రూప్ లో కులాన్ని కూడా అవమానపరుస్తు పోస్టులు పెట్టారు. ఫోన్ లో బెదిరించిన ఆడియోలను, వీడియోలను కూడా రికార్డు చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను స్క్రీన్ షాట్ లతో సహా రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జూన్ ఒకటవ తేదీన కొల్లాపూర్ ఎస్సై కి రిజిస్టర్ పోస్టు చేయడం జరిగింది. అదే రోజు కాఫీ టు సిఐ, డిఎస్పి, జిల్లా ఎస్పీ,  డిజిపికి పోస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో రిజిష్టర్ లో ఎంట్రీ చేశారు. కానీ కేసు ఏమైందో చెప్పలేదు. స్టేషన్ కు వెళ్లినా కూడా ఎస్సై  స్పందించలేదు.

స్టేషన్ కు వెళ్లినట్లు సీసీ కెమెరాలు ఆధారం. ఫోన్ చేసిన స్పందించలేదు. అయితే  నెల పది రోజుల తర్వాత  సోమవారం  కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ రిపోర్టర్ రాజశేఖర్ కి ఫోన్ చేశారు. పిర్యాదు ఒకటే పేజీ ఉంది. సంతకం లేదని కానిస్టేబుల్ చెప్పాడు.

కోర్టులో సబ్మిట్ చేయాలి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అని కానిస్టేబుల్ చెప్పడంతో  ఆరోజు  తీసి పెట్టిన మరో కాపీని ఇవ్వడం జరిగింది. ఆధారాలు మళ్లీ పోలీసులకు ఇవ్వడం జరిగింది. అయితే  ఇది వరకు చేసిన రిజిష్టర్ పోస్ట్ లో ఏవిడేన్స్  లేకుండానే ఆధారాలు ఎవరు దాచారు? అనేది తెలియాలి.

ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు 54 గ్రాములు ఉన్నట్లు స్లిప్పులో ఉంది. మరి రిజిస్టర్ పోస్టులు ఒకటే పేపర్ ఎలా ఉంటుంది. ఈ విషయం పై  రిపోర్టర్ అవుట రాజశేఖర్ వాట్సాప్ ద్వారా  జిల్లా ఎస్పీకి తెలియచేయడం జరిగింది. మొత్తానికి ఒక రిజిస్టర్ పోస్ట్ చేస్తే  ఆధారాలు దాచిపెట్టడం సంతకం చేసిన పిర్యాదు లేకుండా చేశారు.

పోలీస్ స్టేషన్ అంటే ప్రజలకు నమ్మకం ఉండాలి ప్రజలకు. కానీ వీలు ఆ నమ్మకాన్ని కొల్పోయ్యే విధంగా చేస్తున్నారు. ఇది వరకే కొల్లాపూర్ ఎస్సై జి. బాల వెంకటరమణ రిపోర్టర్ అవుట రాజశేఖర్ పై అక్రమ కేసులు పెట్టి, స్టేషన్ లో చిత్ర హింసలు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి.

Related posts

పేరు యావ తప్ప పాలన లేని జగన్ రాజ్యం

Satyam NEWS

రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్న అమెరికా

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: ఎన్నికలను రద్దు చేస్తున్న మరిన్ని రాష్ట్రాలు

Satyam NEWS

Leave a Comment