32.2 C
Hyderabad
May 2, 2024 02: 41 AM
Slider ప్రత్యేకం

రంజాన్ పండుగరోజు కూడా పరీక్ష నిర్వహించడమేమిటి?

1624_Inter_Exams

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్ లో ఎటువంటి మార్పు ఉండదని రంజాన్ పండుగ రోజు కూడా పరీక్ష రాయాల్సిందేనని పరీక్షల సంచాలకులు సర్క్యులర్ జారీ చేయడం అత్యంత హేయమైన చర్యగా సంఘసేవకులు సయ్యద్ సలావుద్దీన్ అభివర్ణించారు.

వందల సంవత్సరాల నుండి ముస్లిములు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండి రమజాన్ పండుగనాడు ఆ దీక్షలను విడిచి అత్యంత భక్తి శ్రద్ధలతో రమజాన్ పండుగను జరుపుకుంటారని తెలిపారు.

ప్రజాస్వామిక దేశంలో అన్ని పండుగలకు అన్ని మత ఆచారాలకు సమాన విలువ ఉంటుందని దానికి అనుగుణంగానే అన్ని పండుగల నాడు సెలవులు ప్రకటిస్తారని తెలిపారు.

ఎన్నడూ లేని విధంగా నేడు రాష్ట్రంలో ముస్లింల పండుగలను సైతం టార్గెట్ చేస్తూ వారి మతాచారాలను భంగం కలిగిస్తూ పండుగనాడు కూడా సెలవులు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడం దారుణమని వాపోయారు.

పండుగ రోజు కూడా సెలవులు ఇవ్వకుండా చేయడం ముస్లిం సమాజం పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే పరీక్షల అధికారులు పరీక్ష సంచాలకులు గందరగోళ జిఓలు జారీ చేస్తూన్నారని తెలిపారు.

రంజాన్ మాసంలోనే వచ్చే సభ్య ఖాదర్ మరియు విధాలకు సైతం ప్రభుత్వం సెలవు ఇవ్వలేదని దీన్నిబట్టి మైనార్టీల పండుగలు మైనార్టీ సంక్షేమం మైనార్టీ మతాచారాలు ప్రభుత్వానికి గిట్టవని తెలుస్తుందని తెలిపారు.

ఎన్నో సంవత్సరాల నుండి ఎస్ ఎస్ సి పరీక్షల షెడ్యూల్ గాని మరి ఇతర అ పరీక్షల షెడ్యూల్ గాని విడుదల చేసినప్పుడు ఆ షెడ్యూలు మధ్యలో ఎటువంటి పండుగ వచ్చినా ఆ రోజు ఉండే పరీక్షను చివరి రోజు జరిగే విధంగా జీవోలు జారీ అయ్యేవని, కానీ అందుకు భిన్నంగా నేడు కేవలం ముస్లిం పండుగలకు మాత్రమే షెడ్యూల్ ఫాలో అవుతూ మీ మిగతా చిన్నాచితకా పండుగకు సైతం షెడ్యూల్లో మార్పులు జరుగుతున్నాయని ఈ సంఘటనలన్నీ ముస్లిం సమాజం పరిశీలిస్తోందని తెలిపారు.

Related posts

ఉత్తర ద్వార దర్శనంతో పులకించిన భక్తులు

Satyam NEWS

విజ్ఞానఖని

Satyam NEWS

పట్టణాలకు దీటుగా మండలం అభివృద్ధి

Bhavani

Leave a Comment