29.7 C
Hyderabad
April 29, 2024 08: 12 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూ పరీక్ష నియంత్రణ అధికారి గా డా. ఆర్.ప్రభాకర్

#vikramsimhapuri

వి ఎస్వి విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగ అధిపతి డాక్టర్ ఆర్. ప్రభాకర్ నేడు పరీక్షల నియంత్రణ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ముందుగా ఉపకులపతి ఆచార్య జి.యం. సుందరవల్లికి, రెక్టర్ ఆచార్య ఎం.చంద్రయ్యకు, రిజిస్ట్రార్ డా ఎల్.విజయ కృష్ణ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము కాకుండా కృషి చేస్తానని ఆయన అన్నారు.

విశ్వవిద్యాలయ అభివృద్ధికి అతి కీలకమైన విభాగం Examination Branch అని ఆయన తెలిపారు. ప్రతిఒక్కరు వారి సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా Examination Branch లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి కలిసి కట్టుగా ఉండి విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఇప్పటి వరకూ Controller of Examination డా సీ ఎస్.సాయి ప్రసాద్ రెడ్డి పని చేసి, ఎన్నో కష్టనష్టాలు ఒడిదుడుకులు ఎదురుకొని Examination Branch ని చాలా చక్కగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఆదే దిశగా వారి అనుభవాలను తమకు ఎల్లవేళలా అందచేయాలని చెప్పారు. విశ్వవిద్యాలయ పెద్దల ఆశీస్సులతో విశ్వవిద్యాలయ కృషికి నిరంతరం శ్రమిస్తానని తెలియచేసారు.

అదేవిధంగా నూతనంగా Additional Controller of Examination గా నియమితులైన డా కోట.నీలమణికంట, డా సిహెచ్. కిరణ్మయి విశ్వవిద్యాలయ ఉపకులపతికి జి.యం.సుందరవల్లి కి, రిజిస్ట్రార్ డా ఎల్.విజయ కృష్ణ రెడ్డి కి, రెక్టర్ ఎం. చంద్రయ్య కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ డా ఉదయ్ శంకర్ అల్లం డా వెంకటరాయిలు సూపరింటెండెంట్ రామ కృష్ణ  కంట్రోలర్ ని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర  సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఫస్ట్ నుంచి పంతుళ్ల కు పరేషాన్ మొదలు

Satyam NEWS

కేంద్ర‌, రాష్ర్ట‌ ప్రభుత్వాలకి కనువిప్పు కలగాలి

Sub Editor

వార్ సిట్యుయేషన్: కాశ్మీర్ ను తలపిస్తున్న అమరావతి

Satyam NEWS

Leave a Comment