పాత కేసు విషయంలో చలానా కోసం వచ్చిన వ్యక్తి వద్ద ఎక్సైజ్ సిఐ శ్రవణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ 9 వేలు లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా ఎసిబికి చిక్కిన ఘటన సోమవారం అచ్చంపేట ఎక్సైజ్ కార్యాలయంలో చోటుచేసుకుంది.
ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట డివిజన్ నందు ఎక్సైజ్ సిఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రవణ్ కుమార్ పదర మండలం మారడుగు గ్రామానికి చెందిన వెంకట్రాం అనే వ్యక్తి 2018 నవంబర్ నెలలో అక్రమ మద్యం తరలిస్తుండడంతో కేసు నమోదై లక్ష రూపాయల జరిమానా విధించారు.
ఈ కేసులో భాగంగా సదరు వెంకట్రాం కు సంబంధించిన వాహనం ఆర్.సి. కొరకు అభ్యర్థించగా చాలానా ఇచ్చేందుకు సిఐ శ్రవణ్ కుమార్ కార్యాలయంలో ప్రింటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారిరువురు 9 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో విసుగు చెందిన వెంకట్రాం ఏసీబీని ఆశ్రయించారు. దీనితో ఎసిబి అధికారులు రంగం లోకి దిగి సదరు సిఐ ని సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ ను 9 వేలు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు