38.2 C
Hyderabad
April 29, 2024 11: 22 AM
Slider సంపాదకీయం

కోర్టు తీర్పులతో బెంబేలెత్తుతున్న యంత్రాంగం

cm jagan

కింది నుంచి పై స్థాయి వరకూ వ్యతిరేకంగా వస్తున్న కోర్టు తీర్పులు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, ఐఏఎస్ అధికారులు బెంబేలెత్తతున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కోర్టుల్లో నిలబడటం లేదు.

మాన్సాస్ ట్రస్టు నుంచి ఆఖరికి బ్రహ్మంగారి మఠం వరకూ ఏ ఆదేశాలను ప్రభుత్వం పకడ్బందిగా ఇవ్వలేకపోయింది. వీటితో బాటు రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కుంటున్నాయి.

ఐఏఎస్ అధికారులు ప్రతి రోజూ చిక్కుల్లో పడిపోతున్నారు. కోర్టు తీర్పులు ముఖ్యమంత్రి మెడకు చుట్టుకోవడం లేదని, కేవలం ఐఏఎస్ అధికారులకు మాత్రమే చీవాట్లు పడుతున్నందున ఆయన స్పందించడం లేదని వారు బాహాటంగా చర్చించుకుంటున్నారు.

అత్యంత విధేయత కనబరుస్తున్న ఐఏఎస్ అధికారులు మాత్రం ఇంకా మారడం లేదని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తుండటాన్ని ఇతర వ్యవస్థలపైకి నెడుతున్న ముఖ్యమంత్రి తాను పాలనాపరంగా చేస్తున్న తప్పుల్ని తెలుసుకోవడం లేదని కూడా అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరి ఉన్నప్పుడు ఆయనపై నేరుగా తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తులు కొందరు ఆయన బదిలీ కావడంతో ఇది తమ విజయమేనని చెప్పుకున్నారు. ఇక ఏపిలో న్యాయవ్యవస్థ నుంచి తమకు అడ్డంకులు ఉండవని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

జస్టిస్ మహేశ్వరి 23 మంది జడ్జిలకు చీఫ్ గా ఉండే స్థాయి నుంచి ముగ్గురు జడ్జిలు ఉండే రాష్ట్రానికి బదిలీ కావడం తమ విజయమని కూడా సోషల్ మీడియాలో అప్పటిలో విపరీతంగా పోస్టులు పెట్టుకున్నారు. ఏపి న్యాయస్థానంలో ఇక తమ నాయకుడికి ఎదురేలేదని చెప్పుకున్నారు.

అయితే ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు పాలనా పరంగా తాము చేసిన తప్పు ఏమిటో తరచి చూసుకుంటే ఇంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

అయితే వ్యతిరేకంగా వస్తున్న కోర్టు తీర్పులను ఒక వ్యక్తికి, ఒక కులానికి ఆపాదిస్తూ కోర్టులపైనే ఎదురుదాడి చేయడం వైసీపీ నాయకులకు అలవాటు అయింది. ఇలా ఒక సారో రెండు సార్లో కాదు. చాలా సందర్భాలలో కోర్టు తీర్పులపై వైసీపీ అగ్రనాయకులు తమ నిరసనను బాహాటంగా వ్యక్తం చేశారు.

పాలనా పరంగా చేసిన తప్పులు సరిదిద్దుకోవడం కాకుండా వ్యవస్థలపై తిరుగుబాటు చేయడం కొన్ని సందర్భాలలో హీరోయిజం అవుతుందేమో కానీ అన్ని విషయాల్లో కాదు… మరీ ముఖ్యంగా కోర్టుల విషయంలో.

ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకుంటే మంచిది. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు మంచి పోస్టింగుల కోసం పాదాక్రాంతులు కాకుండా రూల్ పొజిషన్ ఇప్పటికైనా వివరించి చెప్పి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే మరిన్ని భంగపాట్లు తప్పవు.

Related posts

మైనారిటీ, దళిత నేతలను వైసిపి వాళ్లు చంపేస్తారా

Satyam NEWS

రాజకీయ దాహం ఇంకా తీరలేదా? ఏమిటీ వలసలు?

Satyam NEWS

తెలుగుదేశం వారి రిసార్ట్ లో మంత్రి రోజా పార్టీ

Satyam NEWS

Leave a Comment