40.2 C
Hyderabad
April 28, 2024 17: 26 PM
Slider ముఖ్యంశాలు

భాగ్యనగరంలో పేలుడు పదార్థాలు

#Explosives

భాగ్యనగరంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. పాతబస్తీ చంద్రాయణగుట్టలో జిలిటెన్‌ స్టిక్స్‌ పట్టుబడటం కలవరానికి గురి చేస్తోంది. దాదాపు 600 జిలిటెన్‌ స్టిక్స్, 600 డిటోనేటర్లు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురుని అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బార్కస్‌ ప్రాంతానికి చెందిన అజీజ్‌ మహరూస్‌ అనే వ్యక్తి బాలాపూర్‌కి చెందిన వెంకట్‌రెడ్డి నుంచి జిలెటిన్‌ స్టిక్స్‌ ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నాడు. లైసెన్స్‌ హోల్డర్‌ అయిన వెంకట్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పెద్దమొత్తంలో ఈ పేలుడు పదార్థాలను అజీజ్‌ మహరూస్‌కు చేరవేస్తుండగా చాంద్రాయణ గుట్ట పోలీసులు బార్కస్‌లో పట్టుకున్నారు. వెంకట్‌రెడ్డితో పాటు రమేష్, అజీజ్‌ మహరూస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పి.రాంరెడ్డి, జగదీశ్‌, గోపాల్‌ పరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌వర్మ తెలిపారు.

Related posts

ఎన్‌ఎం‌సి సంతృప్తి చెందాలి

Murali Krishna

అనారోగ్యం తో బాధపడుతున్న నిరుపేద యువకుడికి తస్లీమా సాయం

Satyam NEWS

బి‌ఆర్‌ఎస్ తో పొత్తు లేదు

Murali Krishna

Leave a Comment