28.7 C
Hyderabad
April 28, 2024 10: 02 AM
Slider హైదరాబాద్

నకిలీ డాక్టర్ గుట్టురట్టు

#Fake Doctor

నకిలీ సర్టిఫికెట్​లతో డాక్టర్​గా చలామణి అవుతున్న ఓ వ్యక్తితో పాటు అతనికి సర్టిఫికెట్​ను సమకూర్చిన మరో వ్యక్తిని సౌత్​ ఈస్ట్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫలక్​నుమా ప్రాంతానికి చెందిన ఖాజా ముజామిలుద్దీన్​ (29) ఇంటర్మీడియట్​ ఫెయిల్​ అయ్యాడు. అనంతరం మాసబ్​ ట్యాంక్​ లోని ఓ దంత వైద్యశాలలో పనిచేశాడు.

దీనిని ఆసరాగా చేసుకుని తన స్నేహితుడు సయ్యద్​ అబ్దుల్​ అస్లాం ద్వారా కర్నాటక నుంచి నకిలీ బీడీఎస్​ డాక్టర్​ సర్టిఫికేట్​ పొందాడు. ఇలా 2020 నుంచి ఫలక్​నుమాలో ఆక్సీజన్​ డెంటల్​ క్లినిక్​ నిర్వహిస్తున్నాడు. దీని పై విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్​ ఈస్ట్​ టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ ఎల్​.రమేష్​ నాయక్​, శాలిబండ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి వైద్య సామాగ్రి, నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

మామిడి మొక్కల పెంపకంపై పిల్లలకు మంత్రి గంగుల అభినందన

Satyam NEWS

సీఎం కేసీఆర్ ప్రకటనపై పివి కుటుంబం ఆనందం

Satyam NEWS

ఇంటర్ లో మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment