పురపాలక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని విజయం పథం వైపు నడిపించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆయన తల్లి శోభ ఆశీర్వాదం అందించారు. ఆయనకు స్వీటు తినిపించారు. కేటీఆర్ కు ఆయన కుమార్తె అలేఖ్య మంగళ హారతి ఇచ్చి ఇంట్లోకి (ప్రగతి భవన్) ఆహ్వానించింది. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు ఆయనకు స్వీటు తినిపించారు. తల్లి శోభతో బాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కొడుకు హిమన్షు, అత్తయ్య శశిరేఖ తదితరులు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
previous post