30.7 C
Hyderabad
April 29, 2024 06: 42 AM
Slider ప్రత్యేకం

కులాల పేరుతో కుట్ర: బాలయ్య, చిరంజీవి అభిమానులు అప్రమత్తంగా ఉండాలి

#naralokesh

సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వ‌స్తున్న బాల మావ‌య్య‌, వాల్తేరు వీర‌య్య‌గా వ‌స్తున్న‌ చిరంజీవి గారికి శుభాకాంక్ష‌లు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అల‌రించే పాట‌లు, ఆలోచింప‌జేసే మాట‌లు, ఉర్రూత‌లూగించే డ్యాన్సుల‌తో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాల‌ను కోట్లాది ప్రేక్ష‌కుల‌లో ఒక‌డిగా నేనూ చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాను అని ఆయన అన్నారు.

హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు అధికార పార్టీ స‌న్న‌ద్ధ‌మైంది. ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమాలు విడుద‌లవుతున్న సంద‌ర్భాన్ని వాడుకుని సోష‌ల్ మీడియాలో ఫేక్‌ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మ‌రో కులంపై విషం చిమ్మాల‌ని కుట్ర‌లు ప‌న్నారు. విష‌ప్ర‌చారాలు చేసి కుల‌,మ‌త‌,ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు ర‌గిల్చిన దుష్ట చ‌రిత్ర గ‌లిగినవారి ట్రాప్‌లో ఎవ‌రూ ప‌డొద్దు. సినిమాలు అంటే వినోదం. సినిమాల‌ను వివాదాల‌కు వాడుకోవాల‌నే అధికార పార్టీ కుతంత్రాల‌ను తిప్పికొడ‌దాం. మ‌న‌మంతా ఒక్క‌టే. కులం, మ‌తం, ప్రాంతం ఏవీ మ‌న‌ల్ని విడ‌దీయ‌లేవు అని నారా లోకేష్ అన్నారు.

Related posts

ఉద్యమకారునికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన కార్పొరేటర్ శ్రీదేవి

Bhavani

ఈ వర్షాకాలంలో సన్నరకం వరి మాత్రమే పండించాలి

Satyam NEWS

నారా లోకేష్ తో డీబీహెచ్ పీయస్ అధ్యక్షుడు భేటీ

Satyam NEWS

Leave a Comment