29.7 C
Hyderabad
May 1, 2024 05: 58 AM
Slider నల్గొండ

కౌలు రైతులను, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

#aderla

రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో సోమవారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పంట చేతికందే దశలో వరి పంటకు తాటాకు తెగులు సోకి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని,పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం కారణంగా వరిచేలు మొత్తం నేలకొరిగి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకోవాలని అన్నారు.

హుజుర్ నగర్ మండలం అమరవరం గ్రామానికి చెందిన మద్దుల మట్టపల్లి అనే కౌలు రైతు పొలం గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి మొత్తం నేలకొరిగి తీవ్రంగా నష్టపోయారని,వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు.పండించిన పంటకు మద్దతుధర లేదు,రైతులకు ఉచితంగా ఇస్తానన్న ఎరువుల మాట ఏమైందని,కల్లబొల్లి కబుర్ల మాటలు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రైతులకు ఒరిగింది ఏమిలేదని అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

Satyam NEWS

గణతంత్ర అవార్డ్: ఉత్తముడు… సేవాతత్పరుడు రాజ్ మనోజ్

Bhavani

విలీనం అవసరం లేదు చర్చలకు పిలవండి

Satyam NEWS

Leave a Comment