37.2 C
Hyderabad
April 26, 2024 22: 39 PM
Slider నల్గొండ

క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

#hujurnagarmunicipality

ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా నేడు  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.అనంతరం  హుజుర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి   మాట్లాడుతూ క్షయ రహిత సమాజ నిర్మాణంలో  ప్రతి ఒక్కరు  పాలుపంచు కోవాలని కోరారు.

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ సందర్భంగా లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఇందిరాల రామకృష్ణ కు  ఉత్తమ నోడల్ అధికారిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ  పక్షాన సేవా పురస్కారం  అందించారు.

ఈ సందర్భంగా మండల  వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు,ఆకలి మందగించడం, తెమడలో  రక్త జీరలు వంటి లక్షణాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ  ఉచితంగా పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

క్షయ  రోగులకు చికిత్స కాలంలో ప్రభుత్వం నుంచి పోషణ,ఆహారం నిమిత్తం 500 రూపాయలు డైరెక్టుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో  Dr.కిరణ్, H.E.O ప్రభాకర్, ఉదయగిరి శ్రీనివాస్,ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేగుతున్న వివాదం: అసలు అశోక స్తంభం కధ ఏమిటి?

Satyam NEWS

చికెన్ సెంటర్ లో కరెంట్ షాక్: యవకుడు మృతి

Satyam NEWS

అమరావతి కి సంఘీభావం గా రాజంపేట టీడీపీ నేతల దీక్ష

Satyam NEWS

Leave a Comment