38.2 C
Hyderabad
May 3, 2024 19: 31 PM
Slider విశాఖపట్నం

జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ తీరు బట్టబయలు

#journalists

విజయనగరం లో ఏపీ యూడ్ల్యూజే 26వ జిల్లా మహాసభలు..!

ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా 26వ సర్వసభ్య సమావేశాల సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి ఆంజనేయులు జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ తీరును డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ముందు బట్టబయలు చేశారు. కరోనా సమయంలో మృతి చెందిన జర్నలిస్ట్ లకు సీఎం జగన్ ఒక్కోరికి అయిదు లక్షలు మంజూరు చేసి…జీ.ఓ విడుదల చేసినప్పటికీ…మృతుని కుటుంబాలకు ఇంతవరకు చేరలేదని సభా వేదిక మీదుగా.. దాదాపు 350 మంది జర్నలిస్ట్ ముందు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు మరో కీలక వ్యక్తి జర్నలిస్టులకు ఇలా పరిహారం. ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని అంబటి ఆంజనేయులు వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ ప్రభుత్వం వద్దకు ఈ సమస్య ను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వెంటనే డిప్యూటీ స్పీకర్ స్పందించి…తాను సమస్య ను ప్రభుత్వం వద్దకు తీసుకెళతానని…అయితే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని మాత్రం తాను చెప్పలేనని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్పష్టం చేశారు.

Related posts

పేకాట రాయుళ్లపై కొల్లాపూర్ పోలీసుల దాడి

Satyam NEWS

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ మొదలు

Satyam NEWS

ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు

Sub Editor 2

Leave a Comment