37.2 C
Hyderabad
April 30, 2024 13: 13 PM
Slider ఖమ్మం

అధిక వర్షాల వలన నష్టపోయిన  రైతులను ఆదుకోవాలి

#cpiml

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వలన రైతాంగం వేసిన పత్తి, మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిని ఎర్రబడి పోయాయని అధిక తేమ శాతం వలన  చీడ పీడలు వచ్చి దాని నివారణ కోసం రైతాంగం ఎకరానికి 30 వేల నుండి 40 వెలు వరకు ఖర్చు చేశారని అయినా ఎకరానికి ఐదు కింటాల దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, వారిని వెంటనే ఆడుకోవలని సి‌పి‌ఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ  జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్,  ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా సురేష్ అన్నారు.  ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల   గ్రామంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం  నిర్వహించడం జరిగింది. ఈ సమావేశoలో వారు పాల్గొని మాట్లాడుతూ  రాష్ట్రంలో  రైతాంగం వేసిన 50 లక్షల ఎకరాల పంటలకు ఇదే పరిస్థితి ఉందని,  దీనివలన రైతులు 20వేల కోట్ల రూపాయలు నష్టం రైతాంగానికి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  వ్యవసాయ అధికారులతోని క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి  నష్టపోయిన రైతాంగానికి పత్తికి ఎకరానికి 50వేల మిర్చికి ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ  చట్టం సవరణ ముసాయిదా  నియమాల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  బిల్లును తీసుకువచ్చి 18 రాష్ట్రాలలో  40 కోట్ల మంది  ఆదివాసీలను, గిరిజనులను, గిరిజనేతర పేద ప్రజలను  అడవుల నుండి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు.  అడవిలో ఉన్న  ఖనిజ సంపదను, అడవీ సంపదను, వనరులను బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం వలన పోరాడి సాధించుకున్నటువంటి గిరిజనుల హక్కులు రద్దు అవుతాయని 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి పోడు గిరిజన రైతులకు పది ఎకరాలు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కామేపల్లి -ఏన్కూరు సబ్ డివిజన్ కార్యదర్శి పుచ్చకాయల వెంకటేశ్వర్లు నాయకులు కోలా అప్పారావు,  సిరిపురపు సూర్యం,  ఆంగోతు లాలు, గుగులోత్ భీంసింగ్, సోమనబోయ ఉపేందర్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

29 నుంచి బాసరలో శరన్నవరాత్రులు ఆరంభం

Satyam NEWS

ప్రజా పంథా పార్టీ నాయకుల అరెస్టును ఖండించండి

Satyam NEWS

నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు బెయిల్ మంజూరు

Satyam NEWS

Leave a Comment