శంషాబాద్ దగ్గర అత్యాచారానికి గురైన దిశ కేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలపడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ప్రకటించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నారు.