గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లో మున్నెల్లి మల్లికార్జున రెడ్డి అనే 30 సంవత్సరాల యువకుడికి జ్వర లక్షణాలు కనపడటంతో కరోనా అనుమానిత కేసు గా పోలీసులు నమోదు చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో సైడ్ యాక్టర్ గా పని చేసే మల్లికార్జున్10 రోజుల క్రితం బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చాడు.
నిన్న రాత్రి పల్నాడు ఎక్స్ ప్రెస్ లో పిడుగురాళ్ల కు మల్లికార్జున రెడ్డి చేరుకున్నాడు. వారం రోజులుగా జలుబు, జ్వరం తో బాధపడుతున్నట్లుగా మల్లికార్జున్ తల్లి చెబుతున్నారు. అతను వైద్యసేవలకు కూడా సహకరించే పరిస్థితిలో లేడని తెలిసింది. మున్సిపల్ సిబ్బంది, పోలీసుల ఒత్తిడి మేరకు వైద్యసేవలు చేయించుకునేందుకు మల్లికార్జున రెడ్డి సిద్ధమయ్యాడు.