29.7 C
Hyderabad
May 2, 2024 04: 34 AM
Slider ఖమ్మం

ఇంటింటి ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి

#ministerpuvvada

కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని   కరోనా ఉధృతిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

మంగళవారం ఖమ్మం నగరంలోని 56వ డివిజన్ లో ఫీవర్ సర్వే లో మంత్రి పువ్వాడ పాల్గొని స్థానికులకు జ్వరం చెక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు సిద్దంగా ఉంచాలని మంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

ఇంటింటి ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కరోనాను అరికట్టేందుకు వ్యాక్సినేషన్ లో జిల్లా 100% తో జిల్లా ముందు నిలిచిందని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకముందే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు.

కరోనా, ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ ల బారి నుండి ప్రజలను కాపాడేందుకు  ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు.

జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు, ఏరియా ఆసూపత్రులు,పి.హెచ్. సి.లలో  కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. జిల్లాలో కరోనా పరీక్షల కిట్లకు, ఐసోలేషన్ కిట్లకు కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఏరియా ఆసుపత్రి లో కరోనా రోగులకు వైద్య చికిత్స అందించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించి వైరస్ ను నిరోదించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ V.P. గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, సూడా చైర్మన్ విజయ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కార్పొరేటర్ లు తదితరులు ఉన్నారు.

Related posts

కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న రామగుండం పోలీస్ కమిషనర్

Satyam NEWS

బిటి రోడ్లు, జిపి భవనాలకు నిధుల మంజూరు

Satyam NEWS

మార్చి న 28 విశాఖబంద్‌

Sub Editor 2

Leave a Comment