38.2 C
Hyderabad
April 27, 2024 16: 32 PM
Slider మహబూబ్ నగర్

విద్యార్ధులకు మిషన్ భగీరథ ప్రత్యక్ష పాఠాలు

mission bhageradha

కొల్లాపూర్ పట్టణంలోని గ్రీన్ ల్యాండ్ హైస్కూల్ విద్యార్ధుల ఫీల్డ్ ట్రిప్ ఒక ప్రత్యేక పద్ధతిలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్ధులకు చూపించింది. దీని కోసం ఎల్లూర్ కు విద్యార్ధులను తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ శంకర్ మాట్లాడుతూ విద్యార్ధులకు చిన్నతనం నుంచే నీటి శుభ్రత గురించి చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ ఫీల్డ్ ట్రిప్ ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్ధులకు తరగతి గదికి సబంధించిన విషయాలే కాకుండా నీటి శుద్ధి ప్రక్రియ ఎలా జరుగుతుందో క్షేత్ర పర్యటనలో  విద్యార్ధులకు ప్రత్యక్షంగా చూపించామని ఆయన అన్నారు. దీని వల్ల ఈ విషయం ఆ విద్యార్ధులకు చాలా కాలం గుర్తుంటుందని ఆయన తెలిపారు.

విద్యార్ధులు అక్షయ, ఆదిత్య, గోవర్ధన్ లు నీటి శుద్ధి కార్యక్రమాన్ని ఎలా చేపడతారో ప్రత్యక్షంగా చూడటం ఎంతో ఆశక్తి కలిగిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం వెంకటేశ్, నరేష్, కుమారస్వామి, ప్రిన్సిపల్ శంకర్ టీచర్లు అనిల్, సువర్ణ, సంగీత, శాంతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

గాంధీ కుటుంబాన్ని వేధిస్తున్న గాడ్సే వారసులు

Satyam NEWS

క్లారిటీ: రైతులందరికీ యధావిధిగా రైతు బంధు

Satyam NEWS

ఇష్యూ కంటిన్యూస్:హైకోర్టులో పిటిషన్ వేయనున్న పత్రి ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment