29.7 C
Hyderabad
May 2, 2024 04: 43 AM
Slider ప్రత్యేకం

30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు

finance ministry orders to replace 30,453 posts

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవల శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం శాసన సభలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు. మొత్తం 80,039 పోస్టులకు గాను.. తొలి విడుతగా 30,453 పోస్టుల భర్తీకి ఇవాళ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది.

Related posts

సార్వత్రిక సమ్మెలో భాగంగా నరసరావుపేటలో అరెస్టుల పర్వం

Satyam NEWS

అఫిడవిట్లు దాఖలు చేయండి- హైకోర్టు

Satyam NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగుల జాగరణ

Satyam NEWS

Leave a Comment