40.2 C
Hyderabad
April 29, 2024 15: 54 PM
Slider ఖమ్మం

ప్రజా సంపద పరిరక్షణకే సమ్మె

strike was for the protection of public property

ప్రజా సంపద పరిరక్షణ కోసం, రాజ్యాంగ పౌర హక్కులను కాపాడుకోవడం కోసం ఈ 28, 29 తేదీలలో దేశ వ్యాప్తంగా అఖిల పక్ష కార్మిక, ఉద్యోగ సంఘాలు తలపెట్టి న సమ్మె లో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తుశాకుల లింగయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం గాంధీ చౌక్ సెంటర్ లో సమ్మె జయప్రదం కోరుతూ భవన నిర్మాణ కార్మికుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో లింగయ్య, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ  స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేయాలని, ఈ నెల మార్చి 28,29 తేదీల్లో జరిగే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, జాతీయ ఫెడరేషన్ అసోసియేషన్లు, అఖిలభారత కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చాయన్నారు. అదేవిధంగా 1996 చట్టాన్ని తొలగించకుండా అమలు చేయాలని, ఓహెచ్ఎస్ కోడ్ లను 2020 లొ కలపొద్దని,1979 వలస కార్మికుల చట్టం,1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం,1998 సేస్సు చట్టాలను రక్షించుకోవాలని, పెన్షన్ స్కీమ్ అమలుకు కేంద్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. నిర్మాణం లో వాడే ముడిసరుకుల ధరలు పై జిఎస్టి తొలగించాలని, సెంట్రల్ వెల్ఫేర్ బోర్డు తిరిగి పునర్నిర్మించాలని, కేంద్ర బడ్జెట్ లో అసంఘటిత కార్మికులకు సోషల్ సెక్యూరిటీ కల్పించాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ సమ్మె జాతి సంపద పరిరక్షణ, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం జరిగేదని కావున ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ఉద్యోగులు అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దోనోజు లక్ష్మయ్య, నాయకులు యర్రా మల్లికార్జున్, సారంగి రమణ, పావురాల నాగేశ్వరరావు, దోనోజు పాపాచారి, గూడ బ్రహ్మం,  కొట్టె చిన్నా, జంగం నగేష్, మలిశెట్టి నర్సింహారావు, టి వి రమణ, లింగ కృష్ణ, యనబోతుల  సీతారాములు, ఓర్సు కృష్ణ, వేముల రమణ, వేముల శ్రీను, కిశోర్,‌జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాప్రాలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

జబర్దస్త్ రోజా ఇక జబర్దస్త్ కు గుడ్ బై

Satyam NEWS

బస్తీ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం

Satyam NEWS

Leave a Comment