39.2 C
Hyderabad
April 28, 2024 14: 39 PM
Slider ముఖ్యంశాలు

బిర బిరా కృష్ణమ్మా పరుగులిడుతుంటేను….

#Jurala Project

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం నుంచి వరద నీటిని కిందికి వదులుతున్నారు. కర్ణాటకలోని నారాయణపుర జలాశయం నుంచి అధికారులు 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతుండగా 40 వేల క్యూసెక్కుల జలాలు విడుదలవుతున్నాయి. దీంతో నారాయణపుర నుంచి ఏడు గేట్ల ద్వారా కృష్ణా జలాలు కిందికి దుంకుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు ఈ జలాలు జూరాలకు చేరుకునే అవకాశం ఉన్నదని ప్రాజెక్టు అధికారులు చెప్పారు.

జూరాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

పై నుంచి విడుదల అవుతున్న నీటితో జూరాల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల జలాశయంలో  8.690 TMC నీటిమట్టం నిల్వ ఉండటంతో జూరాల అధికారులు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించారు.  విద్యుత్ కేంద్రంలో 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.

ప్రస్తుతం జురాలకు 14000 క్యూసెకుల వరద నీరు వచ్చి చేరుతుంది. విద్యుత్ ఉత్పత్తికి 13401 క్యూసెకుల వరద నీరు వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 750క్యూసెకులు, కుడి 112 ఎడుమ కాలువకు 700 క్యూసెకులు సమాంతర కాలువకు 900 క్యూసెకులు, బీమా లిప్టుకు 650, కోయిల్ సాగర్ లిప్టుకు 630 క్యూసెకుల నీరును విడుదల చేశారు. జూరాల టోటల్ ఇన్ప్లో 14000క్యూసెకులు, ఔట్ ప్లో 17234 క్యూసెకులు.

త్వరలో జూరాల గేట్లు ఎత్తివేత

జూరాలకు వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని జూరాల గేట్లు తెరిచే అవకాశం ఉందని జూరాల అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు నేటి సాయంత్రం బారీగా వరద వచ్చి చేరుకోనున్నాయి. జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు ఎవరూ నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ శృతిఓఝా ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts

తిరుమలకు మ‌‌ద్యం, మాంసం తీసుకెళుతున్న జర్నలిస్టు అరెస్టు

Satyam NEWS

యాంటీ కరోనా: గంట కొట్టిన జన సేన అధినేత పవన్

Satyam NEWS

హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞతలు

Satyam NEWS

Leave a Comment