38.2 C
Hyderabad
April 29, 2024 11: 13 AM
Slider కరీంనగర్

ఆహార వితరణ చేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్టు

#my Vemulawada

కరోనా రోగులతో బాటు విధినిర్వహణలో అంకిత భావంతో పని చేస్తున్న వైద్య సిబ్బందికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చెందిన మై వేములవాడ  ఛారిటబుల్ ట్రస్టు ఆహారం పంపిణీ కొనసాగిస్తున్నది.

మై వేములవాడ  ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 15వ రోజు ఆహార వితరణ కార్యక్రమం నేడు జరిగింది. అందులో భాగంగా ఈరోజు తిప్పాపూర్ లోని ప్రభుత్వ హాస్పిటల్లో గల కోవిడ్ పేషెంట్లకు, అక్కడ  డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందికి ఆహారం ప్యాకెట్లు అందచేశారు.

అదే విధంగా లక్మి గణపతి కాంప్లెక్స్ లో ఉన్న కోవిడ్ పేషంట్లకు, వారికి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కూడా నేడు మై వేములవాడ  ఛారిటబుల్ ట్రస్టు ఆహారం అందచేసింది.

కోవిడ్ టెస్ట్ సెంటర్లో ఉన్న వైద్య సిబ్బందికి, అక్కడ లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న యాచకులకు కూడా మై వేములవాడ  ఛారిటబుల్ ట్రస్టు ఆహారం ప్యాకెట్లు అందచేసింది.

ఈ కార్యక్రమంలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ నాగరాజు,  డాక్టర్లు మానస,నళిని, నవీన్ ల్యాబ్ టెక్నీషియన్ జయ ప్రకాష్ నారాయణ తో పాటు  ట్రస్టు సభ్యులు కుమ్మరి శంకర్ నూగూరి మహేష్ ,గొంగళ్ల రవికుమార్,  తాటికొండ పవన్ కుమార్ , రంగుల శ్రీనివాస్, నాగుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Related posts

శ్రీ సాయిబాబా ఆలయ నిర్వాహకులకు చిరంజీవి అభినందనలు

Satyam NEWS

పోలీసుల ప్రేక్షకపాత్ర: తల్లీకూతుళ్ల ఆత్మహత్య

Satyam NEWS

కే ఏ పాల్ పై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి

Satyam NEWS

Leave a Comment