30.7 C
Hyderabad
April 29, 2024 05: 35 AM
Slider వరంగల్

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జంగా

janga raghavareddy

ప్రాణాంతకమైనా సరే విధులు నిర్వహిస్తున్న వారిని అభినందిస్తూ పారిశుద్ధ్య కార్మికులు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి 25 రోజులకు సరిపడా నిత్యావసరాలను అందించారు.

కరోనా వైరస్ నేపథ్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి వ్యాధి సోకకుండా నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రభుత్వానికి అండగా నిలిచారని ఆయన అన్నారు.

శుక్రవారం జనగామ జిల్లా రైల్వే స్టేషన్ పరిధిలో మున్సిపాల్టీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు టౌన్ పార్టీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచి ఓటమి పాలైన కౌన్సిలర్లు నాయకులతో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి నిత్యావసరాలు అందచేశారు.

180 మంది పారిశుద్ధ్య కార్మికులు వీటిని అందుకున్నారు. సూర్యుడు ఉదయించక ముందే పట్టణాన్ని శుభ్రం చేస్తూ కరోనా రహితంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో శ్రమ పడుతున్నారని, ప్రాణాంతకమైన విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమళ్ల సుధాకర్, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ వేమల సత్యనారాయణ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, ఫ్లోర్ లీడర్ పాండు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, బరిలో నిలిచి ఓటమిపాలైన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

నేపాల్ భూ భాగాన్ని ఆక్రమించిన చైనా?

Satyam NEWS

విజయనగరం రైల్వే స్టేషన్ అడ్డాగా మైనర్లతో గంజాయి అమ్మకం

Bhavani

సాక్షి మీడియా ప్రచారంపై షర్మిల ఫైర్

Satyam NEWS

Leave a Comment