38.2 C
Hyderabad
April 29, 2024 12: 14 PM
Slider ఆదిలాబాద్

మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్

#foodpoisining

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని బలుగాలలో ఉన్న మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో ఫుడ్ ​పాయిజన్​ జరిగింది. 52 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని వార్డెన్ కు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం బయట ఎవరికీ తెలియకూడదని సిబ్బంది గేటుకు తాళం వేశారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కొంతమంది పిల్లలు కళ్లు తిరిగి కింద పడిపోగా రూరల్ సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి పోలీసు వాహనాల్లో కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని చెప్పారు.

Related posts

గురురాఘవేంద్ర స్వామి ఛారిటబుల్ ట్రస్ట్ సహాయం

Satyam NEWS

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 371 జయంతి

Satyam NEWS

ఓటరు అవగాహన కథనాలకు అవార్డులు

Satyam NEWS

Leave a Comment