28.7 C
Hyderabad
April 27, 2024 05: 24 AM
Slider నల్గొండ

31న పోలియో ఇమ్యానైజేషన్ విజయవంతం చేయండి

#PulsePolio

జనవరి 31 ఆదివారం ఉధృత పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ Dr. నిరంజన్ కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ నిరంజన్ మాట్లాడుతూ  0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు అందించాలని అన్నారు.

ఈసారి కోవిద్ నిబంధనల ప్రకారం పోలియో కార్యక్రమంలో పని చేసే సభ్యులు,హాజరైన ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని, తప్పక మాస్కులు ధరించాలని, ఆరడుగుల దూరం పాటించాలని సూచించారు.

మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ మండల పరిధిని 3 రూట్స్ గా విభజించి 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈ  3 రూట్లను ముగ్గురు రూట్ సూపర్ వైజర్లు పర్యవేక్షణ చేయనున్నట్లు  తెలిపారు.

సంచార జాతులు, ఇటుకల తయారీ, భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా మొబైల్ టీమ్ ను  ఎర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆదివారం  అందరు తమ దగ్గర లోని  పోలియో కేంద్రాలలో తప్పక పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  రూట్ సూపర్ వైజర్లు  ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, గుంజ విజయ,సంతోషి, జ్యోతి,విజయలక్ష్మి,  అలివేలు,స్వరూప,అలవాల ఉపేందర్ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బొమ్మ తుపాకీతో హల్ చల్

Murali Krishna

కాన్పిరసీ: రిజర్వేషన్ల రద్దు కుట్రలను అడ్డుకుందాం

Satyam NEWS

మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment