42.2 C
Hyderabad
April 26, 2024 18: 39 PM
Slider విజయనగరం

లైవ్ టెలీకాస్ట్ ఓన్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కరోనా ప్రభావం

#vijayanagaram collector

కరోనా కారణంగా ఈ ఏడు కూడా స్వాతంత్ర్య వేడుకలు నామమాత్రంగానే జరగనున్నాయి. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆధ్వర్యంలో ఈ నెల 15 న జరగనున్న వేడుకలపై సమీక్ష జరిగింది.

ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను విభిన్నంగా నిర్వ‌హించాల‌ని, అందుకు ప‌క‌డ్భందీగా ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్లో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా జాయింట్ క‌లెక్ట‌ర్(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ఇప్ప‌టి వ‌ర‌కూ స్వాంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించిన విధానాన్ని, వివిధ శాఖ‌లు ప్ర‌తీఏటా చేస్తున్న ఏర్పాట్ల‌ను వివ‌రించారు.

క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, కరోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, సంప్ర‌దాయ‌భ‌ద్దంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఈ ఏడాది కూడా కరోనా కార‌ణంగా సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను వేడుక‌ల‌కు అనుతించ‌బోమ‌న్నారు, స్క్రీన్స్ ఏర్పాటు చేసి లైవ్ టెలీకాస్ట్ ద్వారా ప్ర‌సారం చేస్తామ‌ని చెప్పారు. స్టాల్స్‌, శ‌క‌టాల‌ను ఈ ఏడాది ర‌ద్దు చేస్తూ, వాటికి బ‌దులుగా, న‌వ‌ర‌త్నాలు, వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, ప్రాధాన్య‌త‌ల‌ను  వివ‌రిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

ఒక‌రు లేదా ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కూడిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను, ప‌రిమిత సంఖ్య‌లో ఏర్పాటు చేయాల‌ని సూచించారు. వివిధ శాఖ‌ల వారీగా చేయాల్సిన ప‌నుల‌ను సూచించి, ఈ నెల 12వ తేదీలోగా ఏర్పాట్ల‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

ఈ స‌మావేశంలో జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డీఎఫ్ఓ స‌చిన్ గుప్తా, డీఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Related posts

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన డిసిపి

Satyam NEWS

చిత్రావతి ముంపు గ్రామంలో తీవ్ర ఉద్రికత్త

Satyam NEWS

ట్రిబ్యూట్: అమర జవాన్లకు ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment