29.7 C
Hyderabad
April 29, 2024 07: 27 AM
Slider హైదరాబాద్

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ లో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ నగర్ వాసులతో సమావేశమై అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతో అంబర్ పేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, అందులో భాగంగానే ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి, వరద నీటి పైప్ లైన్లు వేయడం, పార్కుల అభివృద్ధి, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వంటి అనేక ఇతర పనులను చేపడుతున్నామని అలాగే ప్రజల నుండి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

జూన్ 17వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్ల‌ జారీ

Satyam NEWS

బాలికపై రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

Sub Editor

రాజుగారి దెబ్బకు రాజకీయ వ్యూహం మరిచిన పెద్దలు

Satyam NEWS

Leave a Comment