37.2 C
Hyderabad
April 26, 2024 22: 03 PM
Slider సంపాదకీయం

ఫోర్ స్క్వేర్: చుక్కలు చూపిస్తున్న ఆ నలుగురు

#Y S R Congress Party

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 151 స్థానాలతో అప్రతిహత విజయం సాధించిన సంవత్సరంలోనే ఎంతో మందితో వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా నలుగురు మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఇరకాటంలో పెట్టిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ప్రధమ స్థానంలో ఉన్నారు.

ఆయన ప్రభుత్వ పరంగా జరుగుతున్న లోపాలను వెలికి తీసుకురావడంతో పార్టీకి ప్రధమ శత్రువుగా మారిపోయారు. ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని కష్టాలను కొనితెచ్చుకున్నది. పార్టీ మనుగడనే ఆయన ప్రశ్నించేందుకు ఉద్యుక్తులయ్యారు. ఆయన షోకాజ్ నోటీసుకు సమాధానంగా సంధించిన ప్రశ్నలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ సమాధానం కూడా చెప్పలేకపోయింది.

కొరకరాని కొయ్యగా తయారైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టులో, హైకోర్టులో ప్రశ్నించి విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహాయనికి గురైన రమేష్ కుమార్ ఆ తర్వాతి కాలంలో ఆయనకు చుక్కలు చూపించారు.

రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులను కొట్టేసింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కారం కేసు నమోదు చేసి ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేయకుండా కావాలని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేస్తున్నదని ఆయన అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టుల్లో సవాల్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వ్యక్తి న్యాయవాది జంధ్యాల రవి శంకర్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలలోని లా పాయింట్లను ఆయన బయటకు తీసుకువస్తూ కీలక పాత్ర పోషిస్తున్న జంధ్యాల రవి శంకర్ రాష్ట్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ఈ ముగ్గురితో బాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు విశ్లేషణాత్మకంగా ప్రజలకు వివరిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఉండవెల్లి అరుణ్ కుమార్ నిష్పాక్షిక విశ్లేషణ చేస్తారని ప్రతీతి. ఆయన వెలికి తీసుకువస్తున్న విషయాలు, ఆవ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆయన సంధించిన ప్రశ్నలు మేధావి వర్గంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న భ్రమలు తొలగించేశాయి. వాస్తవారిని ఉండవల్లి కామెంట్ల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఆయనకు ఉన్న క్రెడిబిలిటీ అలాంటిది.

విషయం ఏమిటంటే ఈ నలుగురూ కూడా వై ఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులు. వై ఎస్ రాజశేఖరరెడ్డి పలు సందర్భాలలో ఈ నాలుగురితో కలిసి పని చేశారు. వై ఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రాణంగా భావించే ఈ నలుగురిని ప్రస్తుతం ఆయన కుమారుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శత్రువులుగా మార్చుకున్నారు.

Related posts

జిజిహెచ్ లో విజయవంతంగా అరుదైన శస్త్ర చికిత్స

Satyam NEWS

శరణాగతి

Satyam NEWS

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి

Bhavani

Leave a Comment