36.2 C
Hyderabad
April 27, 2024 22: 42 PM
Slider వరంగల్

హనుమకొండలో బాలబాలికలకు ఉచిత ఆరోగ్య శిబిరం

Free health camp for boys and girls at Hanumakonda

బాలల దినోత్సవం పురస్కారించుకొని హనుమకొండ బాలసముద్రం లోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్, సుబేదారిలోని దివ్యాంగుల బాలికల వసతి గృహం, బాలసదనం అనాధ పిల్లల హాస్టల్, ఎస్. సి ,హస్టల్ లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అనురాగ్ సొసైటీ ప్రసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన, గణపతి సచ్చిదానంద ట్రస్ట్ సహకారం తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా మందులను అందించారు. డాక్టర్ కంటేం లక్షీనారాయణ వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలను సలహాలు అందించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్ లక్ష్మీనారాయణ , డాక్టర్ అనితా రెడ్డి పిల్లలకు తెలిపారు. శరీర , పరిసరాల పరిశుభ్రత లోపించడం వలన వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తాయని జాగ్రత్తగా ఉండాలని అలాగే త్రాగు నీరు కలుషితం కావడం ద్వారా వ్యాధులు రావచ్చునని తెలిపారు. వీటిని నివారించడం కోసం తప్పనిసరిగా కాచి చల్లార్చి వడపోసిన నీటిని త్రాగుటకు ఉపయోగించాలని మల మూత్ర విసర్జన అనంతరం, భోజనానికి ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. వేడి వేడి ఆహార పదార్థములు భుజించాలని ఆహార పదార్థాలపై మూతలు సరిగా ఉంచాలని తెలిపారు.

నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, రోడ్ల వెంబడి అమ్మే తినుబండారాలు, పానీయాలు తీసుకోకూడదు అని డాక్టర్ లక్షీనారాయణ, డాక్టర్ అనితా రెడ్డి పిల్లలకు తెలియ చేసారు. అనంతరం డాక్టర్ అనితా రెడ్డి వినియోగదారుల హక్కుల చట్టం ఎన్. సి. ఆర్. సి గురించి తెలియ చేసారు. ప్రతి ఒక్కరికి చట్టాల పై అవగాహన అవసరం అని అనితా రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా 643 మందికి వైద్య సేవలు మరియు వినియోగదారులు హక్కుల చట్టం పైన అవగాహన కల్పించడం ఙరిగింది దని ఒకే రోజు నాలుగు చోట్ల సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతృప్తి ని అందించింది అని అనితా రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమం లో వార్డెన్ కళ్యాణి రవి, సారంగం, జాన్సి ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

మతి స్థిమితం లేని యువతిపై ఆసుపత్రిలో అత్యాచారం

Satyam NEWS

సేవ్ డెమోక్రసీ: పౌరసత్వ బిల్లును రాజ్యసభలో ఆపండి

Satyam NEWS

డోకిపర్రులో గోదాదేవి కల్యాణానికి హాజరైన చిరంజీవి దంపతులు

Satyam NEWS

Leave a Comment