31.7 C
Hyderabad
May 2, 2024 10: 57 AM
Slider కడప

పాత్రికేయ ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానం కు జంబు…

#Journalist Jumbu

కడప జిల్లా రాజంపేట నియోజక వర్గం నందలూరు మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లె సర్పంచ్ గా పాత్రికేయ రంగం నుంచి వచ్చిన జంబు సూర్య నారాయణ పోటీ వాతావరణం మధ్య వైసీపీ టిక్కెట్ పొంది అంతే పోటీ వాతావరణం మధ్య విజయం సాధించారు.

విద్యార్థి దశనుంచే జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గా పని చేసిన జంబు సూర్యనారాయణ పత్రికా రంగం వైపు ఆకర్షితులై సాయంకాలం పత్రికా విలేకరిగా మొదలు పెట్టి, సూర్య, వార్త,ఆంధ్ర ప్రభ రాజంపేట పి.సి.ఇంచార్జీ గా పనిచేశారు. మొదటి నుంచి వ్యాపార రంగంలో పేరు పొందిన మేడా మల్లిఖార్జున రెడ్డి కుటుంబం పై అంటే అమితమైన అభిమానం పెంచుకున్నారు.

ఆ అభిమానం నేడు ప్రత్యక్ష రాజకీయాలలో కీలక పాత్రకు అవకాశం కలిపించింది. మేడా కుటుంబీకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు కావడం వారి రాజకీయ ప్రయాణం లో జంబు సూర్యనారాయణ కు కలిసి వచ్చింది.

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలో స్వంత పార్టీ నుంచి పోటీ ఉన్నా వారిని కాదని మేడా కుటుంబ అభిమానికి అవకాశం కలిసి వచ్చింది. మీడియాలో నిజాలను నిర్భయంగా రాసి స్వంత పార్టీ వారిని ఇరుకున పెట్టిన సూర్యనారాయణ కు స్వపక్షం లోనే నెగిటివ్ ప్రచారం జరిగింది.

టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి హేమలత కు పాజిటివ్ టాక్ వచ్చినా, వాటిని తన పాత్రికికేయు తెలివితేటలతో సమర్ధవంతంగా ఎదురుకొన్నాడు. మొత్తం 16 వార్డులకు గాను 11 వార్డులు వైసీపీ, 4 వార్దులు టీడీపీ, 1వార్డు స్వతంత్ర అభ్యర్థి గెలు పొందగా, వైసీపీ సర్పంచ్ అభ్యరిగా జంబు సూర్య నారాయణ 601 ఓట్ల మెజారిటీతో గెలు పొందారు.

స్వపక్షంలో విపక్షాల కుట్రలను దీటుగా ఎదుర్కొని విజయం సాధించిన జంబు భవిష్యత్ రాజకీయ సవాళ్ళను అంతే దీటుగా ఎదుర్కోవాలని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని రాజంపేట కళం గలం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఆకాంక్షించారు.

Related posts

మట్టి గణపతులను మాత్రమే పూజించండి

Satyam NEWS

ప్రొఫెసర్ నాగేశ్వర్, బీజేపీ రాంచందర్ రావు పట్టభద్రులను పట్టించుకోలేదు

Satyam NEWS

కృష్ణా పరివాహక తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment