33.7 C
Hyderabad
April 27, 2024 23: 33 PM
Slider నెల్లూరు

బాలికల వసతి గృహంలో పండ్ల మొక్కలు

Nellore

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బాలికల వసతిగృహంలో ఈ రోజు విశ్వవిద్యాలయ ఉపకులపతి రొక్కం సుదర్శన రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి వసతి గృహ పరిసరాల్లో పండ్ల మొక్కలను నాటారు. వసతి గృహంలో ఉండే బాలికలకు మంచి పోషకాహారాన్నిఅందించే కార్య‌క్ర‌మంలో భాగంగా ఆరోగ్యాన్నిపెంపొందించే పండ్ల మొక్కలను నాటాలని తద్వారా బాలికలకు మంచి ఆరోగ్యాన్నిఇవ్వగలమని ఆ సంకల్పంతోనే పండ్ల మొక్కలను నాటించాలని వసతి గృహంలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తో నేడు కార్యక్రమంలో మేలు జాతికి చెందిన అరటి, బొప్పాయి పండ్ల చెట్లను నాటారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి, పాల్గొని కొన్నిమొక్కలను నాటారు. అనంతరం సుదర్శన రావు మాట్లాడుతూ వసతి గృహ పరిసరాల్లో ఇలాంటి చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్నికాపాడటంతో పాటుగా, మంచి ఆరోగ్యాన్నికూడా పెంపొందించుకోగలమని చెప్తూ వసతి గృహ సిబ్బందిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో బాలికల వసతిగృహ వార్డెన్ డా ఆర్.మధుమతి, C.D.C డీన్ విజయానంద బాబు, NSS సమన్వయకర్త డా.ఉదయ్ శంకర్ అల్లం, ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్‌, పరీక్షలనిర్వాహణాధికారి డా సి.యస్.సాయిప్రసాద్ రెడ్డి, డా హనుమ రెడ్డి, డా మేరిసంధిప, డా సాయినాథ్, ఎన్ యస్ యస్ సిబ్బంది, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది వసతిగృహ బాలికలు పాల్గొన్నారు.

Related posts

అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదానం చేయండి

Satyam NEWS

మాట ఇవ్వడం.. మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం

Bhavani

నెల్లూరులో కిడ్నాప్ సృష్టించిన కలకలం

Satyam NEWS

Leave a Comment