40.2 C
Hyderabad
April 29, 2024 16: 40 PM
Slider ప్రత్యేకం

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పూర్తి అవినీతి మయం

#uttamkumarreddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాలిటీ పూర్తిగా హద్దులు దాటి అవినీతి మయంగా మారిందని, స్థానిక తెరాస నాయకులు అందరూ కలిసి మున్సిపాలిటీ నిధులను,లే అవుట్ భూములను కాజేస్తున్నారని అన్నారు. ఆదివారం పట్టణంలొ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు,మున్సిపాల్టీ కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి కెసిఆర్,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కు లేఖ రాస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో శాసనసభ్యుడు సైదిరెడ్డి ప్రేమేయంతోనే అవినీతి జరుగుతోందని ఆరోపించారు.గత తొమ్మిది నెలల నుండి మున్సిపాలిటీ సమావేశం నిర్వహించకుండా ముందస్తు అనుమతుల పేరుతో 2 కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. ప్రతి నెల కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎందుకు 9 నెలల నుండి మున్సిపల్ సమావేశం నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే కీలుబొమ్మగా మున్సిపల్ కమిషనర్

మున్సిపల్ కమీషనర్ ఎమ్మెల్యే కు కీలు బొమ్మగా మారి వందల కోట్ల అవినీతికి తెర లేపారని అన్నారు.దేశంలోనే అవినీతికి హుజూర్ నగర్ మున్సిపాలిటీకి పేరు వచ్చిందన్నారు.మున్సిపాలిటీలో లే అవుట్ డాక్యుమెంట్లు,కమీషనర్ సంతకం ఫోర్జరీ చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములకు రక్షణ లేకుండా పోయిందని ఈ భూములను కాపాడాల్సిన భాధ్యత హుజూర్ నగర్ ప్రజలకు ఉందని ఉత్తమ్ గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ పోరాటం చేయడానికి కంకణ బద్దులు కావాలని అన్నారు.

హుజూర్ నగర్ లోని సాయిబాబా టాకీస్ రోడ్డులో గల మున్సిపాలిటీ లే అవుట్ స్థలం 5,500 గజాలలో 75 లక్షల రూపాయలతో ఇంటి గ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం నాటి నేటి మంత్రి జగదీష్ రెడ్డి శంఖు స్థాపన చేశారని,తిరిగి స్థలాన్ని మార్చి ఎన్ ఎస్ పి క్యాంపులో కోర్టులో ఉన్న స్థలంలో ఎన్ ఎస్ పి కార్యాలయాలను కూల్చివేసి 7 కోట్ల 50 లక్షల రూపాయలతో తిరిగి ఇంటి గ్రేటెడ్ మార్కెట్ కు శంఖు స్థాపన చేసి పనులు మొదలు పెట్టారని,75 లక్షలు ఉన్నది 7 కోట్ల 50 లక్షల రూపాయలు ఎలా అయిందని,కమీషన్ల కోసమే ఆ మార్కెట్ నిర్మాణమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీ లే అవుట్ స్థలం వి.పి.ఆర్ వెంచర్ లొ ఉన్న 2,000 గజాల స్థలం,గ్రామ పంచాయితీగా ఉన్నప్పుడు ఉన్న స్థలం ఇప్పుడు ఎటుపోయిందని అన్నారు.సాయి బాబా టాకీస్ రోడ్డులో ఉన్న 5,500 గజాల స్థలం కూడా అదే రీతిలో ఉంటే తాను శాసనసభ్యుడు గా ఉన్నంత కాలం మున్సిపాలిటీ క్రింద ఉంటే తాను ఎం.పి గా వెళ్లిన తర్వాత ఆ స్థలం యజమాని అప్పుడు గ్రామ పంచాయతీకి రాసి ఇచ్చిన అగ్రి మెంట్ ఎటు పోయిందని,బీరవోలు సోమిరెడ్డి ఆ వెంచర్ యజమాని కోర్టుకు వెళితే మున్సిపాలిటీ ఏమి చేసిందని,స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నాడని ప్రశ్నించారు.కమిషనర్ సంతకం,ఏ.ఈ,ఆర్.ఐ ల లాగిన్ లు దొంగతనం చేశారని,పోలీసులకు ఫిర్యాదు చేసిన సి.ఐ రామలింగారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపాల్టీలో పూర్తి స్థాయిలో అధికారులు లేరని,ఇక్కడ పని చేయడానికి అధికారులు ఎవరు రావడం లేదని గుర్తు చేశారు.

అక్రమ వెంచర్లపై ఎందుకు చర్య తీసుకోవడం లేదు?

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 40 ఎకరాలు లే అవుట్ లు లేకుండా అక్రమంగా వెంచర్లు పెట్టి అమ్మకాలు  చేస్తున్న కమీషనర్ ఎందుకు చర్యలు  తీసుకోవడం లేదని,హుజూర్ నగర్ తహా శీల్దర్ జయశ్రీ కుంటలలో ఎందుకు     రిజిస్టేషన్ చేస్తున్నారని అన్నారు.

మున్సిపాలిటీ లే అవుట్ స్థలాల్లో ఉన్న బోర్డులు కూడా మాయం చేశారని అన్నారు.ఈ నెల 30న, సూర్యపేట జిల్లా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ  సమావేశం నిర్వహించాలని,జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,కౌన్సిలర్లతో ధర్నా చేస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున రావు, సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్,కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,రాజా నాయక్,విజయ వెంకటేశ్వర్లు,వేముల వరలక్ష్మి నాగరాజు,వేముల వెంకన్న, నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు జక్కుల మల్లయ్య, ముక్కంటి,బంటు సైదులు గౌడ్,ముశం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

15-18 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్

Sub Editor

ఘర్షణ ప్రాంతం నుంచి వెనక్కి మళ్లుతున్న చైనా, భారత్

Satyam NEWS

కేంద్ర‌, రాష్ర్ట‌ ప్రభుత్వాలకి కనువిప్పు కలగాలి

Sub Editor

Leave a Comment