30.7 C
Hyderabad
April 29, 2024 05: 47 AM
Slider ప్రపంచం

ఘర్షణ ప్రాంతం నుంచి వెనక్కి మళ్లుతున్న చైనా, భారత్

#Galwan Vally

చైనా భారత్ ల మధ్య జరుగుతున్న సైనిక అధికారుల స్థాయి చర్చలు కొంత మేరకు ఫలితం ఇస్తున్నాయి. ఇరు దేశాల సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి కనీసం మూడు కిలోమీటర్ల వెనక్కి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లడం ప్రారంభం అయిందని సైనిక వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే వరకూ చైనాను నమ్మాడానికి వీల్లేదని కూడా భారత్ భావిస్తున్నది. ఇరు దేశాల సైనికులు ముష్టియుద్ధానికి దిగగా 20 మంది భారత సైనికులను కిరాతక చైనా పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే.

గాల్వాన్ లోయ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్స్, పామ్ గాంగ్ టిఎస్ ఓ ల నుంచి ఇరు దేశాల సైనికులు వెనక్కి మళ్లాలని ఆదివారంనాడు నిర్ణయించగా చైనా ఆ పని చేసింది లేనిది బుధవారంనాటికి ఒక స్పష్టత వస్తుంది. ఘర్షణ జరిగి భారత సైనికులను దొంగ దెబ్బ తీసిన చైనా ఆ ప్రదేశం అంటే పిపి 14 నుంచి వెనక్కి మళ్లుతున్నట్లు సమాచారం అందింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాహనాలు వెనక్కి మళ్లినట్లు కనిపిస్తున్నది.

Related posts

రంగుమారిన ధాన్యాన్నిషరతులు లేకుండా కొనుగోలు చేయాలి

Satyam NEWS

ఏపీలో ప‌గటి పూట క‌ర్ఫ్యూ ఎత్తివేత‌…? ఈ నెల 11 నుంచి వర్తింపు

Satyam NEWS

పార్లమెంట్ ను రాష్ట్రపతి ప్రారంభించాలి

Bhavani

Leave a Comment