29.7 C
Hyderabad
April 29, 2024 08: 12 AM
Slider ప్రత్యేకం

టేక్ ఆక్షన్:రూల్స్ వైలేషన్ పై మంత్రి గంగుల పై చర్య

gangula voilating rules niranjan coplient e c

ఓటేశాడు పోతూ పోతూ ఇంకో మాటేసాడు ఆ మాట కాస్త ఎన్నికల ప్రవర్తనావళికి విరుద్ధంగా ఉంది.వెరసి ఈ మాటలన్నా మంత్రి గంగుల కమలాకర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ లీడర్ నిరంజన్.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మంత్రి గంగుల కమలాకర్ పై అయన ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి కారుగుర్తుకు ఓటేయాలని బహిరంగంగా కమలాకర్ లైన్ లో ఉన్న ఓటర్లను కోరాడని అయన అన్నారు.ఇవి ఎన్నికల ప్రక్రియకు విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు నిరంజన్ . ఇంతకీ ఎం జరిగిందంటే శుక్రవారం కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగుతున్నప్పుడు 42 వ డివిజన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న గంగుల కమలాకర్ పోలింగ్ స్టేషన్ లో వున్న ఓటర్లతో మాట్లాడుతూ నేను కారు గుర్తుకు ఓటు వేశాను మీరందరూ కారు గుర్తుకే ఓటు వేయాలని బహిరంగంగానే కోరారు.

దీనితో మంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మంత్రి గంగుల కమలాకర్ పై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని,ఆయన ఓటును పరిగణలోకి తీసుకోకుండా కరీంనగర్ కార్పొరేషన్ లో మళ్ళీ ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ పార్టీ తరపునఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశామని నిరంజన్ చెప్పారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్ రోలర్స్ సమావేశం

Satyam NEWS

ఈ సారి చంద్రబాబు గెలవకపోతే…..

Satyam NEWS

గాంధీ డాక్లర్లపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

Satyam NEWS

Leave a Comment