36.2 C
Hyderabad
May 7, 2024 12: 05 PM
Slider ప్రత్యేకం

విశాఖ ఉత్తరం: గ్రౌండ్ కోల్పోయిన గంటా

#gantasrinivasarao

గతంలో తృటిలో విజయం చేజారింది..ఈసారి విజయం తప్పకుండా సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా నాయకులు కేకే రాజు. 2019 లో టీడీపీ నేత గంట శ్రీనివాస రావు పై స్వల్ప ఓట్లు తేడాతో ఓటమి పాలయ్యారు కేకే రాజు.

ఒక్కసారి నియోజకవర్గ వివరాల్లోకి వెళ్తే కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. అలాగే వైకాపా కూడా టీడీపీ కి ఏ మాత్రం తగ్గకుండా బలాన్ని పెంచుకుంటుంది. ఈసారి ఎలాగైనా ఈ నియోజకవర్గంలో వైకాపా జెండా ఎగురవేయ్యాలని కేకే రాజు పావులు కదుపుతూన్నారు. గెలిచిన తరువాత గంట శ్రీనివాస రావు ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కార్యక్రమాలు అన్ని గంట శ్రీనివాస రావు అనుచరులే నిర్వహిస్తూ వైకాపా కి ధీటుగా బదులిస్తున్నారు.

గంట శ్రీనివాస రావు ఈసారి ఉత్తరం నుండి పోటీ చేసే ఆలోచనలో లేరని, ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తారు అని సన్నిహితులు గుస గుసలాడుతున్నారు. ఐతే టీడీపీ కూడా ఇక్కడ ఇన్ చార్జిని నియమించలేదు. దీనితో వైకాపా నేత కేకే రాజు నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్త్రత స్థాయిలో నిర్వహిస్తున్నారు. అధినేత జగన్ నుండి 2024 ఎన్నికల్లో ఇక్కడ నుండే పోటీ చేయడానికి కేకే రాజు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఐతే కర్ణుడు చావుకు శాపాలు కారణం అయినట్టు ఇక్కడ కేకే రాజు కూడా కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి.

సొంత పార్టీ నుండి ఎటువంటి గొడవలు లేకపోయినా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తో కేకే రాజుకు ముప్పు తప్పేటట్టు లేదు. 2014 లో పొత్తులో భాగంగా బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు ఇక్కడ నుండి విజయం సాధించారు. వ్యక్తిగతంగా కూడా విష్ణుకుమార్ కు మంచి పేరు ఉంది. అలాగే టీడీపీ కేడర్ బలంగా ఉన్నందున బలమైన నాయకుడ్ని ఇన్ చార్జిగా నియమిస్తే కేకే రాజుకు తిప్పలు తప్పవు.

అంతే కాకుండా జనసేన కు కూడా ఇక్కడా ఉష శ్రీ, డాక్టర్ బొడ్డేపల్లి రఘు లు కూడా యాక్టీవ్ గా ఉన్నారు. జనసేన కూడా గతంలో కంటే ఇక్కడ ఓటింగ్ ని పెంచుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎం.ఎల్.ఏ విష్ణుకుమార్ రాజు కు టికెట్ కన్ఫామ్ చేస్తారు అనేది టాక్. పొత్తు ఉంటే విష్ణు విజయం నల్లేరు పై నడకే అని చెప్పాలి.

అలా కాకుండా జనసేన, టీడీపీ పొత్తు ఉంటే విష్ణు కుమార్ రాజు టీడీపీ లో చేరతారు అని, ఆయానికే టికెట్ అని ప్రచారం నడుస్తుంది. కేకే రాజు, విష్ణు కుమార్ రాజు లు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. పైగా ఇద్దరూ వివాద రహితులు, వ్యక్తిగతంగా మంచి పేరున్న వ్యక్తిలే కానీ విష్ణుకుమార్ కి టికెట్ కన్ఫామ్ ఐతే కేకే రాజు కు మరోసారి ఓటమి తప్పదు అనేది ఇక్కడ టాక్. టీడీపీ బలమైన కేడర్.. పెరిగిన జనసేన ఓటింగ్ తో కేకే రాజు కు ముప్పు ఎక్కువే. జనసేన, టీడీపీ పొత్తు లేక పోయినా విష్ణు టీడీపీ కి రావడం ఖాయం అని ఇన్ సైడ్ టాక్.

అంతే కాకుండా టీడీపీ నుండి గంటా మేనల్లుడు తో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. విష్ణు కి టికెట్ ఇచ్చినా తమ సహకారం ఉంటుందని టాక్. అందుకే టీడీపీ పొత్తులో భాగంగా ఇక్కడ ఇన్ చార్జిని నియమించలేదు అనేది జగమెరిగిన సత్యం. ఏది ఏమైనా కేకే రాజు వర్సెస్ విష్ణుకుమార్ రాజులు సమరం ఖాయం.

రామకృష్ణ పూడి, సత్యంన్యూస్.నెట్, విశాఖపట్నం

Related posts

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

విద్యార్థులకు మాత్రలు వేసిన ఎమ్మెల్యే హన్మంత్ షిండే

Satyam NEWS

అగ్ని ప్రమాదంలో తండ్రీ కొడుకులు సజీవదహనం

Murali Krishna

Leave a Comment