40.2 C
Hyderabad
April 29, 2024 18: 03 PM
Slider సినిమా

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ విడుదల

#waltairverayya

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, మాస్ కు చాలా ప్రత్యేకమైన చిత్రం కానుంది. బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కావడం, అభిమానులకు కావాల్సిన అంశాలన్నీ సమపాళ్ళలో అందించి చిత్రాన్ని పర్ఫెక్ట్ ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు. ఫుల్ మీల్ ఫీస్ట్‌కి ముందు, మేకర్స్ సినిమా నుండి పోస్టర్‌లు, గ్లింప్స్, లిరికల్ వీడియోలను విడుదల చేస్తూ చిన్న చిన్న ట్రీట్‌లతో ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తున్నారు.

ఈ రోజు థర్డ్ సింగిల్ వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ని విడుదల చేశారు. ఇది ఎక్స్ టార్డినరీ అడిక్టివ్ నంబర్. వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ అన్ని వర్గాల మ్యూజిక్ లవర్స్, ముఖ్యంగా మాస్ ని మెస్మరైజ్ చేసే ఇన్స్టెంట్ హిట్. చంద్రబోస్ రాసిన ప్రతి పదం ఉరుములా వుంది.

బలమైన లిరిక్స్ తో  పవర్ ఫుల్ తుఫానును సృష్టిస్తుంది. వాల్తేరు వీరయ్య పరాక్రమాన్ని వీరోచితం ప్రజంట్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ టైటిల్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇదే. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన కంపోజిషన్‌తో బ్రాస్ ఆర్కెస్ట్రా సెక్షన్ బ్యాంకాక్ మ్యుజిషియన్స్ తో రికార్డ్ చేశారు. 

అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడారు. ఆల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ట్రాక్ అన్ని రికార్డులను బద్దలు కొట్టబోతోంది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు.

చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయికగా కనిపిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న

ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

రూ.2 వేల మద్యం బాటిల్ రూ.300 తక్కువకే

Satyam NEWS

ఈ స్కూల్ ను కాపాడకపోతే ప్రభుత్వమే వేస్టు

Satyam NEWS

ఎటాక్:బీజేపీ నాయకుడి ఇంటి ఫై అర్ధరాత్రి దాడి

Satyam NEWS

Leave a Comment