37.2 C
Hyderabad
May 2, 2024 12: 14 PM
Slider రంగారెడ్డి

కుషాయిగూడ బడి ఆవరణ లో పేరుకుపోయిన చెత్తకుప్పలు

#kushaiguda

కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చెత్త కుప్పలు పేరుకుపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బడి వెనుక భాగం చెట్ల కొమ్మలు, చెత్తా, చెదారంతో నిండిపోయి పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. కొంత చెత్తను ఆవరణలోనే తగలబెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పేరుకుపోయిన చెత్త చీదు మూలంగా దోమలు వృద్ధి చెందడం కాకుండా పాములు తేళ్లు ఆవాసం ఏర్పాటు చేసుకునే ప్రమాదం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, పారిశుద్ధ్య విభాగం అధికారులు స్పందించి  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని చెత్తకుప్పలు చీదు చెదరాన్ని తక్షణమే తొలగించి బ్లీచింగ్ చర్యలు చేపట్టాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, స్థానికులు, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు ఎంపల్లి పద్మారెడ్డి, పనగట్ల చక్రపాణి గౌడ్, యావపురం రవి, అశోక్ తదితరులు కోరుతున్నారు.

సత్యంన్యూస్ మేడ్చల్ జిల్లా

Related posts

రెడ్డిలను విస్మరిస్తే కేసీఆర్ కు సత్తా చూపిస్తాం

Satyam NEWS

విజయనగరం లో కొనసాగుతున్న బంద్..!

Satyam NEWS

టార్గెట్ పవన్ కల్యాణ్: చేసెయ్ తప్పుడు ప్రచారం

Satyam NEWS

Leave a Comment