30.7 C
Hyderabad
April 29, 2024 04: 34 AM
Slider హైదరాబాద్

హిందూ స్మశాన వాటికను ఆక్రమించిన ఘనులు

#Ghans

అంబర్పేట్ నియోజకవర్గంలోని ముసరాంబాగ్ అలీ కేఫ్ ప్రాంతంలోని TS. 41 నంబర్ గల భూమిలో హిందూ స్మశాన వాటిక మరియు కమ్యూనిటీ హాల్ ని కొందరు కబ్జాదారులు ఆక్రమించి ప్రైవేటు చెత్త దుకాణాన్ని నడుపుతున్నారు. ఈ భూమిపై ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తుల మధ్య అనేక సంవత్సరాలుగా కోర్టులో కేసు కొనసాగుతా ఉంది. 1975 సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ భూమిని మిగులు భూమిగా గుర్తించి స్వాధీనం చేసుకుంది.

ఈ మధ్యకాలంలో ఓవర్ కోర్టులో ప్రైవేటు వ్యక్తులు కేసు ఓడిపోయారని తెలిపారు. ప్రభుత్వం ఇందులో కొంత భాగాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. 2007లో మిగిలిపోయిన భూమిలో 500 గజాల్లో కమిటీ హాల్ ని నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ డబ్బుతో నిర్మాణం చేపట్టిన కబ్జాదారులు మళ్లీ హైకోర్టుకు పిటిషన్ వేయడంతో స్టే ఉంది.

ఆ కమిటీ హాల్ ని దుకాణంగా మార్చి కిరాయికి ఇస్తున్నారు. ఈరోజు అంబర్ పేట్ తాసిల్దార్ కి కంప్లైంట్ ఇయ్యడంతో డిప్యూటీ తాసిల్దార్ విఆర్ఓ వచ్చి దుఖాన్ని మూసివేసి తాళం వేయడం జరిగిందన్నారు. వారిపై ఆక్రమించుకున్న వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మహేందర్, ముధం బాలాజీ, మోహన్, రుద్ర తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ప్రజా వ్యతిరేక పంథాలో నడుస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి

Satyam NEWS

ఎర్ర చందనం స్మగ్లర్ భాస్కరన్ పై పిడి చట్టం

Satyam NEWS

ఏసిబికి పట్టుబడ్డ సీతారాంపురం ఎమ్మార్వో

Satyam NEWS

Leave a Comment