40.2 C
Hyderabad
April 29, 2024 16: 34 PM
Slider హైదరాబాద్

జీహెచ్ఎంసీ పబ్లిక్ టాక్ (ప్రజావాణి)

ghmc

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సత్యం న్యూస్ ఓటర్లను కలుసుకొని వారి మనోభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా సామాన్యుడి అభిప్రాయాలు పట్టుకునే హోటళ్లు, రెస్టారెంట్లు, కూరగాయల మార్కెట్లు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చిన్నసర్వే చేపట్టింది.

ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు తేటతెల్లమయ్యాయి.

ఏ పార్టీలైనా కానీ ఎంత చేసినా చివరలో చేసిందే ప్రజలు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇందులో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వరదముంపు సహాయంపై ఆగ్రహోదగ్రులవుతున్నారు. కేవలం అనుచరులు, బంధుమిత్ర గణానికి (వరదముంపు సహాయం అందించి మిగతా వారికి మాత్రం ఉత్త‌ షేక్ హ్యాండ్లు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం ఉన్నారు ప్ర‌జ‌లు) అందించి మిగతా వారికి రిక్త హస్తాలు అందించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురిని ఈ విషయమై కదిలించగా ఈ విషయంలో నేతలు చేసుకునే పని చేసుకుంటారు. మా సమాధానం ఓట్ల ద్వారానే చెబుతామంటున్నారు. అంటే దీన్నిబట్టి చూస్తే వరదముంపు సహాయం ఏ పార్టీలను ముంచుతుందోననే అనుమానం రేకెత్తుతోంది. ఇప్పటికే ఆయా బస్తీల్లో పర్యటిస్తున్న అధికార పార్టీ నేతలకు ప్రజలు ప‌గ‌లే చుక్కలు చూపిస్తుండడం తెలిసిందే.

ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయన్న విషయం అధికార పార్టీకి తెలుసు! అంటే వరదముంపు సహాయం ఆగుతుందన్నదీ తెలుసు! దీన్నిబట్టి చూస్తే ఇప్పుడు వరదముంపు సహాయం కొందరికి అందినా.. అందరినీ తాము మేనేజ్ చేసుకుంటామనే అధికార పార్టీ భావించి ఉండవచ్చు. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రజాగ్రహానికి కారణం అవుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీయే వరద సహాయం ఆపివేయించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కూడా ప్రజల్లో ఆగ్రహం ఉంది. బీజేపీపై కూడా ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో ఓటరు ఎవరివైపు తీర్పు చెబుతాడో అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నలాగే కనిపిస్తోంది. ఎంత గుచ్చి గుచ్చి సత్యం న్యూస్ ప్రతినిధి అడిగినా ఓటరన్న మాత్రం ఓటు ఎవరికి వేస్తాడనే విషయం మాత్రం సూటిగా, స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం.

ఏది ఏమైనా ఓటర్ల తీర్పు ఈ సారి విలక్షణంగా ఉండబోతోందనేది మాత్రం స్పష్టమవుతోంది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీ కట్టబెడతారా? బీజేపీకా? కాంగ్రెస్కా? ఇతరులకా? అతి త్వరలో తేలిపోనుంది.

Related posts

బ్లాక్ మెయిల్ కు గురయిన యువతి కి పోలీసులు అండ

Bhavani

15 నుండి 18 సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులందరికీ వ్యాక్సిన్ తప్పనిసరి

Satyam NEWS

సమగ్ర శిక్షా క్యాలెండర్ ను విడుదల చేసిన ధర్మాన

Satyam NEWS

Leave a Comment