కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో నిషేదిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను భారీగా డంప్ యార్డులో అధికారులు తగులబెట్టారు. మూడు కేసులలో సీజ్ చేసిన సుమారు 60 లక్షల విలువ చేసే డంప్ ను మచిలీపట్నంలోని డంపింగ్ యార్డులో కాల్చి నాశనం చేసారు. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు.
ఇంకా జిల్లాలో సీజ్ చేసినటువంటి నిషేధిత గుట్కా, ఖైనీ సుమారు 60 లక్షల మేరకు ఉందన్నారు. నిల్వలు ఉంచిన వారిపై కేసులు పెట్టి జరిమానా విధించామని, జరిమానా చెల్లించిన అనంతరం జాయింట్ కలెక్టర్ ఉత్తర్వుల మేర వాటిని కూడా అందరి సమక్షంలో కాల్చి నాశనం చేస్తామని తెలిపారు.