18.7 C
Hyderabad
January 23, 2025 02: 37 AM
Slider జాతీయం

లక్కీ ఛాన్స్: కార్పొరేట్ వర్గాలకు తీపి కబుర్లు

nirmala 6

కేంద్ర వార్షిక బడ్జెట్ -2020 కార్పొరేట్ వర్గాలకు, డిపాజిటర్లకు తీపి కబురు అందించింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 15శాతం తగ్గించారు. కొత్తగా అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు చేయడం,  డివిడెండ్‌ డిస్ర్టిబ్యూషన్‌ ట్యాక్స్‌ రద్దు చేయడం కీలక అంశాలు. అదే విధంగా డిపాజిట్‌ బీమా పరిధి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు కూడా ఆర్ధిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

ఇక ఎల్ఐసీని ప్రవేటీకరణ చేస్తామని ప్రకటించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించిన ఆర్థిక మంత్రి, రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. 26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు, ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.15లక్షల కోట్లు వ్యవసాయ రుణాల లక్ష్యం. కౌలు భూములకు కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు కేటాయిస్తామన్న సీతారామన్ త్వరలో కొత్త విధానం తెస్తామన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తామన్నారు. 2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్త కోర్సులు,  నేషనల్‌ పోలీస్‌, ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ ప్రారంభిస్తాం.  ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్‌ కాలేజీ అనుసంధానం , కొత్తగా సరస్వతి, సింధు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Related posts

బంగాళాఖాతంలో మరో సారి అల్పపీడనం

Satyam NEWS

ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వారికి ఉరిశిక్ష

Satyam NEWS

సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Satyam NEWS

Leave a Comment