39.2 C
Hyderabad
April 28, 2024 13: 09 PM
Slider మహబూబ్ నగర్

మహాశివరాత్రి రోజున కొల్లాపూర్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎల్లేని

#bjpnagarkurnool

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు హైవే సుధాకర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. మాట ఇచ్చి పది రోజులు కూడా కాలేదు అప్పటికే గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చారు. ప్రజలకు మాయ  మాటలు చెప్పి, పబ్బం గడిచాక వాటిని తాకట్టు పెట్టి, స్వార్థాలకు పాల్పడుతున్న నాయకులను  ఈరోజుల్లో చూస్తూనే ఉన్నాం.

అలాంటి ఈ రోజుల్లో  ఎలాంటి పదవులు లేకున్నా ఆయన నియోజక అభివృద్ధికి పాటు పడుతున్నారు. కొల్లాపూర్ మీదగా  సోమశిల- సిద్ధేశ్వరం వంతెనను కలుపుతూ జాతీయ రహదారిని కూడా తీసుకొ స్తునామని  చెబుతున్నారు. అందుకే ఆయన ఇంటి పేరును హైవే సుధాకర్ రావు గా మార్చారు ఆయన అనుచరులు. ఇది ఇలా వుంటే గతవారం రోజుల క్రిందట కొల్లాపూర్  ఖాదర్ పాషా ఉర్షు సందర్భంగా  ఈద్గా దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ముస్లిం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన పాల్గొన్నారు.

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అభిలాష్ రావు, జగదీశ్వర్ రావు సమక్షంలోనే సుధాకర్ రావు మాట్లాడారు. త్వరలో కేంద్ర నిధులతో  కొల్లాపూర్ ఖాదర్ పాషా దర్గాను అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. వారం పదిరోజులలో జాతీయ మైనారిటీ కౌన్సిల్ సభ్యులు హనీఫ్ అలిని కలుస్తామన్నారు. కొల్లాపూర్ కు తీసుకోస్తామన్నారు. అయితే ఆయనను కలిశారు. సమావేశం అయ్యారు.

ఖాదర్ పాషా దర్గా అభివృద్ధి అంశంపై చర్చించారు. ఆయన తో పాటు పలువురు ముఖ్యులు మార్చి4వ తేదీన కొల్లాపూర్ కు వస్తున్నట్లు ఎల్లేని ప్రధాన అనుచరుడు ఇమ్రాన్ ఖాన్ తెలియ చేశారు. ఖాదర్ పాషా దర్గాను టూరిజం ప్రాంతంగా మార్చాలని కోరిన  సంగతి తెలిసిందే.

దీనికి కేంద్రం నాలుగు కోట్ల నిధులు  కేటాయించడం జరుగుతుందని, అందరూ సహకరించాలని ఎల్లేని ఆరోజు ఈద్గా దగ్గర మాట్లాడుతూ జామ్ మజీద్ కమిటీ సభ్యులను కోరారు. మొత్తం మీద ఖాదర్ పాషా దర్గాకు మంచి రోజులు రాబోతునట్లు తెలుస్తుంది. మహాశివరాత్రి రోజున ఈ గుడ్ న్యూస్ వినడం సంతోషకరంగా ఉందని బీజేపీ కొల్లాపూర్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి యండి. ఇమ్రాన్ ఖాన్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ఈ జీవోతో లోకేష్, పవన్ కల్యాణ్ లను అడ్డుకోవడం సాధ్యమేనా?

Bhavani

అస్సాం ముఖ్యమంత్రిపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

Satyam NEWS

పాజిటీవ్ కేసులు పెరిగినా ప్రజలు భయపడవద్దు

Satyam NEWS

Leave a Comment