38.2 C
Hyderabad
April 29, 2024 13: 15 PM
Slider నల్గొండ

గుడ్ వర్క్: భగీరథ యత్నంలో చిరుమర్తి సేన

#MLA Chirumarthi Lingaih

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో రామన్నపేట, చిట్యాల, నార్కట్ పల్లి, మునుగోడు మండలాలకు సాగు నీరు అందించడానికి నిర్మించ తలపెట్టిన ధర్మారెడ్డి కాలువ పనులు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణునికి ఉన్నన్ని శాపాలు ఈ కాలువకు ఉన్నట్లున్నాయి.

వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటి సారి ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ కాలువ పనులు ప్రారంభ మయ్యాయి. సుమారు 20 సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న పనులు ఎప్పుడు పూర్తి అవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే రామన్నపేట, చిట్యాల మండలాల రైతులకు ప్రయోజనం చేకూరెందుకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అహర్నిశలు కృషి చేస్తున్నారు.

కాల్వ నిర్మాణ పనుల్లో టీఆర్ఎస్ నాయకులు

సాంకేతికంగా ఎదురవుతున్న ఆటంకాలు, పై ప్రాంతాలకు చెందిన రైతులు కల్పిస్తున్న ఇబ్బందులు, మారుతున్న అలైన్మెంట్ లు ఇలా అనేక సవాళ్ల మధ్య కొనసాగుతున్నాయి. చిట్యాల మండలానికి సాగు నీరును రప్పించేందుకు రైతులు, తెరాస నాయకులు, కార్యకర్తలు కాలువ నిర్మాణ పనులలో తాము భాగస్వాములౌతున్నారు. బుధవారం రోజున చిట్యాల కు చెందిన తెరాస శ్రేణులు శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ఆదేశాల మేరకు కాలువ పనుల్లో పాల్గొన్నారు.

ధర్మారెడ్డి కాలువ నీళ్ల కోసం

రామన్నపేట మండలం సిరిపురం గ్రామ శివారులో కాలువలో నీటి పారుదల కు అడ్డంగా ఉన్న బండ రాళ్ళని బ్లాస్టింగ్ చేయించి, రాళ్లను బయటవేశారు. దీని కారణంగా కాలువ నీళ్లు ముందుకు ప్రవహించడానికి అవకాశం ఏర్పడింది. వచ్చే వారి నాట్ల వరకైనా ధర్మారెడ్డి కాలువ నీళ్లు సాగుకు అందుతాయని వారు ఆశిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బిల శివశంకర్ రెడ్డి, కోనేటి కృష్ణ, జిట్టా బొందెయ్య, దాసరి నర్సిహ్మ, జయారపు శివ, భిక్షం రెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్‌

Satyam NEWS

మద్యం షాప్ ను వెంటనే తొలగించాలని ఎక్సైజ్ కమిషనర్ వినతిపత్రం

Satyam NEWS

నిరాశ్రయులకు కడప బాలయ్య ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment