38.2 C
Hyderabad
April 29, 2024 19: 46 PM
Slider ఖమ్మం

దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డ్స్

#Government health

దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదుల సంక్షేమ నిధి ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కు అడ్వకేట్ ఫండ్ రూ.100 కోట్లతో న్యాయవాదులకు కేటాయించిన నిధులతో వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆకాంక్షతో హెల్త్ కార్డ్స్ ను మంజూరు చేయడం జరిగిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసే బాధ్యత కేసీఆర్ తీసుకున్నారని, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని పోరాడిన న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేశారని పేర్కొన్నారు.ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్వర్యంలో రూ.2లక్షలతో భార్య, భర్త ఇద్దరికీ కలిపి రూ.2 లక్షల వరకు అన్ని గుర్తింపు హాస్పిటల్స్ నందు క్యాష్ లెస్ వైద్య చికిత్సలు పొందే అవకాశం కల్పించడం జరిగిందని మంత్రి పేర్కొన్నరు.

ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్వర్యంలో 300 మందికి కేటాయించిన హెల్త్ కార్డ్స్ ను అడ్వకేట్స్ కు పంపిణీ చేశారు.
మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం ద్వారా మన అందరికీ న్యాయం జరుగుతుంది అని అన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా Brs పార్టీని ఘన విజయంతో ఐక్యంగా పోరాడి గెలిపించుకునే హ్యాట్రిక్ కొట్టాలని పిలుపునిచ్చారు.

పొట్ల శ్రీకాంత్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దిరిశాల కృష్ణారావు, బారాస లీగల్ సెల్ న్యాయవాదులు పొట్ల శ్రీకాంత్, బిచ్చాల తిరుమలరావు, బెల్లం ప్రతాప్, కొత్త వెంకటేశ్వర రావు, మేకల సుగుణరావు, మామిడి హనుమంతరావు, గుప్త, ప్రవీణ్, పసుపులేటి శ్రీనివాస్, సింగం జనార్ధన్, ఎక్కిరాల రాంబాబు తదితరులు ఉన్నారు.

Related posts

ఏపి బీజేపీ నుంచి మరో వికెట్ అవుట్: సోమూ ఏ క్యాహై?

Satyam NEWS

అన్నమయ్య జిల్లా లో ఒక్క ఇసుక క్వారీకి కూడా అనుమతి లేదు

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం

Satyam NEWS

Leave a Comment