38.2 C
Hyderabad
April 27, 2024 18: 17 PM
Slider ప్రత్యేకం

అన్నమయ్య జిల్లా లో ఒక్క ఇసుక క్వారీకి కూడా అనుమతి లేదు

#bhatyala

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం లోని ఏ ఒక్క ఇసుక రీచ్ కు కూడా అనుమతులు లేవని గత మార్చి నెలలోనే నారాయణ నెల్లూరు కామంతరాజపురం బాలరాజు పల్లె నందలూరు మండలం సుండుపల్లె సిద్ధవటం మండలాల్లోని అన్ని ఇసుక క్వారీలకు గడువు ముగిసిందని అయినా వైసీపీ నాయకుల అండదండలతో వారి అనుచరులు ఇస్తారాజ్యంగా ఇసుక క్వారీలను అక్రమంగా నిర్వహిస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారని రాజంపేట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగల్ రాయుడు దుయ్యబట్టారు.

శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భత్యాల మాట్లాడుతూ ఇసుక క్వారీలకు గడువు ముగిసిందని ఒకపక్క సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ చెబుతున్న స్థానిక పోలీసులు మైనింగ్ శాఖ అధికారులు ఇసుక క్వారీ నిర్వాహకుల వద్ద ముడుపులు తీసుకుంటూ క్వారీలను అనుమతి ఇవ్వడం చాలా తప్పు అని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఇసుక క్వారీలపై దాడులు నిర్వహించి అక్రమ ఇసుక ఇసుక క్వారీలు అన్నింటిని సీజ్ చేయాలని తెలిపారు.

ఇవాళ ఇటీవల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాము అక్రమ ఇసుక క్వారీలు అన్నింటిని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తీసుకున్న ఇసుక ను అడ్డుకున్నామని చెప్పారు. తర్వాత ఈ విషయంపై తాసిల్దార్ కు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. దొంగలను పట్టుకోమని మేము ఫిర్యాదులు చేస్తే దొంగ దొంగ అంటూ మా వెంటే పోలీసులు వెంటపడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

రైతులు ఎడ్ల పన్నుల ద్వారా ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను వారి వారి ఇళ్ల నిర్మాణాలకు తీసుకెళ్తే పోలీసులు వారిపై దాడులు నిర్వహించి కేసులు పెడుతున్నారే. తప్ప క్రమంగా ఇసుక రీచ్ ను నిర్వహిస్తున్న బడా దొంగలను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వారు సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను గౌరవిస్తూ అక్రమ ఇసుక క్వారీల వద్ద ఈ క్వారీలకు అనుమతి లేదు ఎవరైనా ఎక్కడ నుంచి ఇసుకను తరలిస్తే వెంటనే మైనింగ్ శాఖ అధికారులకు రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేయాలని ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

అదేవిధంగా ఇకనుంచి రైతులు కు ఎవరికైనా ఇసుక కావాలంటే మీరు అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక క్వారీ నిర్వాహకులకు ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదని. ఈ సందర్భంగా తెలిపారు. పోలీసు మైనింగ్ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఇసుకపారులను అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అద్దెపల్లె ప్రతాప్ రాజు,గన్నే సుబ్బ నరసయ్య లతోపాటు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జెఈఈ (మెయిన్) ఫలితాలలో శ్రీచైతన్య కొత్త రికార్డు

Satyam NEWS

యువ ముఖ్యమంత్రి కరోనా రోగుల్ని పరామర్శించడం లేదు..ఎందుకో?

Satyam NEWS

9న కొప్పరపు కవుల కళాపీఠం మహాసభ

Satyam NEWS

Leave a Comment