36.2 C
Hyderabad
April 27, 2024 22: 24 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూ లో ఆడియో వీడియో విజువల్ సెంటర్ ప్రారంభం

#VSU

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రగాణంలో శ్రీ పోట్టి శ్రీరాముల భవనం లో ఆడియో వీడియో విజువల్ లెక్చర్ క్యాప్చరింగ్ సెంటర్ ను విశ్వవిద్యాలయ ఉపకుపతి ఆచార్య జి.యం.సుందరవల్లి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైస్-ఛాన్సలర్ ఆచార్య జి. యం.సుందరవల్లి మాట్లాడుతూ ఈ ఆడియో వీడియో విజువల్ సెంటర్ ద్వారా విశ్వవిద్యాలయంలో ఆన్ లైన్ కోర్సులు, మూక్స్ కోర్సుల రూపకల్పన, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆన్ లైన్ ట్రైనింగ్, ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ వంటివి చేపడతామన్నారు. ఉన్నత విద్యలో ఆధునికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మన విశ్వవిద్యాలయం ముందుకు సాగుతోందని అన్నారు.

విద్యార్థులకు అన్ని తరగతి గదులలో కూడా స్మార్ట్ బోర్డులను ఏర్పాటు చేశామని, ఈ సెంటర్ ద్వారా వారందరితో ఒకేసారి అనుసంధానం అయ్యే అవకాశం కూడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.రామచంద్ర రెడ్డి, ఆచార్య అందే ప్రసాద్,డాక్టర్ యం.ఉస్సేనయ్య, డాక్టర్ సిహెచ్.విజయ, డాక్టర్ సిహెచ్.

డాక్టర్ వెంకట్రాయలు, డాక్టర్ యం.హనుమ రెడ్డి, డాక్టర్ ఉదయ శంకర్ అల్లం, డాక్టర్ పి.సుబ్బరామరాజు, సహాయక రిజిస్ట్రార్ సుజయ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Satyam NEWS

పాన్ వరల్డ్ మూవీ “కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్”

Satyam NEWS

కొనసాగుతున్న భారీ వర్ష సూచన

Satyam NEWS

Leave a Comment