42.2 C
Hyderabad
April 26, 2024 16: 40 PM
Slider కరీంనగర్

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలి

#AdiSrinivas

పేద ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. కరోనా మహమ్మారితో పల్లెల్లో పిట్టల్లా రాలిపోతున్న కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు.

ఎదురుగట్ల చెక్క పెళ్లి జయవరం మల్లారం నిజామాబాద్ సుద్దాల, వేములవాడ పట్టణంలో మరణించిన పలువురి కుటుంబాలను సోమవారం అం ఆయన పరామర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబాలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని ఆయన కోరారు.

అనంతరం ఆయన రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామం లో నేడు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కరోనా మహమ్మారి వల్ల పల్లెల్లో అనేకమంది పేద ప్రజలు కరోనా బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు దొరకక ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వ్యాధిని నయం చేసుకుంటున్నారు, కొంతమంది చని పోతున్నారు  చాలా బాధాకరం అని ఆయన అన్నారు. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనాను రాజీవ్ ఆరోగ్యశ్రీ లో కరోనా చేర్చాలని పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయం అని ఆయన అన్నారు. వెంటనే కరోనా మహమ్మారి ని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ఎక్కడినుండో ఆదేశాలు వస్తున్నాయి ఇక్కడి వారు సూచనలు చేస్తున్నారు కానీ మండల స్థాయిలో 50 పడకల ఆసుపత్రి యుద్ధప్రాతిపదికన చేయమంటే చేయలే వేములవాడ లో వంద పడకల ఆస్పత్రికి ఇంకా అందుబాటులోకి రాకపోవడం బాధాకరం అని ఆయన అన్నారు.

ప్రజలందరూ ఏలాంటి భయాందోళనలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు  తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

Related posts

ఈ సారి పోలీసు “స్పందన” ప్రత్యేకంగా…!

Satyam NEWS

హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు

Satyam NEWS

ప్రతిభగల మహిళలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment