40.2 C
Hyderabad
April 28, 2024 15: 09 PM
Slider ప్రత్యేకం

మత్స్యకారుల కష్టాలు ప్రభుత్వానికి పట్టావా?: పాలవలస యశస్వి

#palavalasayaseshvi

జనసేన మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనగల్ల రాజు నేతృత్వంలో విజయనగరం  గంటస్థంభం వద్దనున్న చేపల బజార్, కాటవీధి,అశోక్ నగర్ లో ఉన్న మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 20న మత్స్యకార అభ్యున్నతి సభను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురం లో నిర్వహిస్తున్నారని,ఆసభకు మద్దతు గా విజయనగరంలో మత్స్యకారుల కుటుంబాలను కలసి,వారికోసం ప్రభుత్వం పై చేసే పోరాటం కోసం తెలిపి, ఆసభకు కూడా వారిని రమ్మనమని ఆహ్వానించడం జరిగిందని తెలిపారు.

మత్స్యకారులంతా తమ గోడును విన్నవించారని,వీరి వినతులను అధినేతకు తెలుపుతామని,ముఖ్యంగా మత్స్యకార సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపు ఎందుకు పెంచట్లేదని,ఎన్నికల ప్రచారంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు ఇస్తామని చెప్పిన పది లక్షలు ఎందుకు ఇవ్వట్లేదని,మత్స్యకారుల బాధలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు.జనసేన మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనగల్ల రాజు మాట్లాడుతూ మత్స్యకారులు అంతా 20వ తేదీన జరగబోయే మత్స్యకార అభ్యున్నతి సభకు తరలిరావాలని కోరుతూ, మత్స్యకారులకు అండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తప్పా రాష్ట్రంలో ఏనాయకుడూ మాట్లాడట్లేదని, మత్స్యకారులు అందరికీ న్యాయం చేయడానికి అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి పోరాడతామని తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, జనసేన మత్స్యకార వికాస విభాగం కార్యవర్గం సభ్యులు గనగల్ల రాజుకు అడుగడుగునా  హారతులు ఇచ్చి,పూలమాలతో మత్స్యకారులంతా నీరాజనాలు పలికారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు తుమ్మి లక్ష్మి రాజ్,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), లాలిశెట్టి రవితేజ,జనసేన కార్పొరేట్ అభ్యర్థులు లోపింటి కళ్యాణ్, హుస్సేన్ ఖాన్,దాసరి యోగేష్, యర్నాగుల చక్రవర్తి, మిడతాన రవికుమార్, విశ్వ,కిషోర్, సాయి,శ్రీరామ్,కుమార్,వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

[OTC] Is There A Birth Control Pill That Helps You Lose Weight Supplements For Weight Loss Men Best Weight Loss Pills 2017 Bodybuilding

Bhavani

తెలంగాణలో ఒక్క రోజులో తాగేసింది ఎంతో తెలుసా?

Satyam NEWS

అమరుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం

Satyam NEWS

Leave a Comment