26.7 C
Hyderabad
April 27, 2024 07: 27 AM
Slider తెలంగాణ

74 మంది అవినీతి ఎమ్మెల్యేల చిట్టా బయటపెట్టబోతున్నాం

anam

జర్నలిస్టులకు కలమే ఆయుధమని, ఐక్యత, పోరాటాలే బలమని, జర్నలిస్టుల జోలికి వచ్చే నాయకుల, అధికారుల చరిత్రలు తోడేందుకు తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం సిద్ధమవుతోందని రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సమావేశ మందిరంలో జరిగిన టీజేఎస్ ఎస్ ఉమ్మడి జిల్లా జర్నలిస్టుల సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీజేఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గం నేతలు అయితగాని జనార్ధన్, నర్సింగ్ రావు, ఎం.డి ఖాజాపాషా, యాలాల శ్రీధర్, రాజేష్, నరేందర్, శ్రవణ్ తదితరులు హాజరయ్యారు.

సంఘం న్యాయ సలహాదారు అంజయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆనం చిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అక్షరాలను అమ్ముకునే వ్యక్తులతో జర్నలిజం విలువలు మంట కలుస్తున్నాయని దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైనే ఉందన్నారు. అక్షరాలు అమ్ముకునే విష సంస్కృతిని విడనాడాలని పిలుపునిచ్చారు. అధికారపార్టీ పత్రికకు సమర్పించుకునే ప్రభుత్వ ప్రకటనలతో చిన్న పత్రికలకు ఒరిగిందేమీ లేదన్నారు. 

దీనివల్ల సుమారు 250కి పైగా చిన్న పత్రికలు మరుగున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. వాస్తవాలను రాస్తే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఇలాంటి అధికారులు కూడా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని 74 మంది ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను త్వరలోనే  బయటపెడతామని ప్రకటించారు. జర్నలిస్టుల ప్రగతికి 100 కోట్లు ఇస్తున్నాం అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వ పెద్దమనిషికి జర్నలిస్టులు పడుతున్నా అవస్థలు  గ్రహించాలని హితవు పలికారు.

వాస్తవాలను ప్రశ్నిస్తే జర్నలిస్టులను అవహేళన చేసే  పద్ధతిని ప్రభుత్వ పెద్దమనిషి మార్చుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంపై టీజేఎస్ స్పందించబోతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే సీఎం విలేకరుల సమావేశంలో జర్నలిస్టు ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పాలి లేదా ఖండించాలి, ఈ విధంగా ప్రవర్తనపై త్వరలోనే  కార్యాచరణ ప్రకటించ బోతున్నామని అన్నారు. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం తరఫున త్వరలోనే ఒక న్యూస్ చానల్ తో పాటు తెలుగు దినపత్రిక ప్రారంభించనున్నామని వివరించారు.

జర్నలిస్టుల అక్రిడేషన్ వ్యవహారంలో అటు ప్రభుత్వం ఇటు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపానెల్ మెంట్ అక్రిడేషన్ లకు ఎలాంటి సంబంధం లేదని ఎంపానెల్ మెంట్ అనేది వాణిజ్య ప్రకటనలకు సర్కులేషనుకు సంబంధించిన వ్యాపారపరమైన సర్టిఫికెట్ అని అన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అధికారులు అక్రిడియేషన్ కార్డులకు మెలిక పెట్టడం సమంజసం కాదన్నారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని త్వరలోనే టీజేఎస్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు.

అధికార ప్రతినిధి ఐతగాని జనార్దన్ మాట్లాడుతూ 30 ఏళ్ల నుండి నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు రావడం లేదు కానీ 30 వేలు ఇస్తే వారికి మాత్రం అక్రిడేషన్ కార్డులు వస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి నర్సింగ్ రావు మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం రెండు అంశాలపై జర్నలిస్టులను చైతన్యవంతం చేస్తామని అని వివరించారు.

సహాయ కార్యదర్శి ఎం.డి ఖాజాపాష మాట్లాడుతూ సంఘం జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. కోశాధికారి రాజేష్ మాట్లాడుతూ కేవలం ఒక రూపాయతోనే రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామన్నారు. జర్నలిస్ట్ సంక్షేమ నిధులు సంఘం సమ కూరుస్తుందని అన్నారు. ఎవరిని ఒక రూపాయి యాచించే పరిస్థితిలో సంఘం ఉండబోదని స్పష్టం చేశారు.

కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీధర్ యాలల మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు అక్రమ కేసులు వ్యవహారంలో ప్రతిపక్షాల మద్దతు కూడగట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు న్యాయ సలహాదారులు ఉండేవిధంగా న్యాయవాదులను నియమిస్తామని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా సభకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి అధ్యక్షులు ఈరని జంగయ్య ఆధ్వర్యంలో జర్నలిస్టులు వజ్ర లింగం, శేఖర్ యాదవ్, శ్రీధర్ రాజు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు కందికొండ రాజ్ కుమార్, వేణుమాధవ్, నవీన్ కుమార్ వెలిగుండాల, సమ్మయ్య గౌడ్, అఫ్జల్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శాఖా సిబ్బందిపై విజయనగరం ఎస్పీ ఆగ్ర‌హం…..!

Satyam NEWS

పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ వాస్తవమే

Satyam NEWS

తమిళసై పై అనుమానాలు రావడానికి కారణం?

Satyam NEWS

Leave a Comment