ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించే దిశగా రాష్ట్ర హైకోర్టు చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. కార్మికులతో చర్చలు జరిపేందుకు సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ, కార్మికుల మధ్య సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేద్దామని రాష్ట్ర హైకోర్టు ప్రతిపాదించింది. అయితే దీనికి నిన్న కోర్టులో ప్రభుత్వం తరపు నుంచి సమాధానం రాకపోవడంతో ఒక రోజు అవకాశం కల్పించింది. దాంతో నేడు ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ప్రతిపాదనకు ప్రభుత్వం విముఖత చూపింది. ఆర్టీసీ సమ్మె అంశం లేబర్ కోర్టులో ఉండడం వల్ల కమిటీ అవసరం లేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీ సమ్మెపై చట్ట ప్రకారం లేబర్ కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది.
previous post