37.2 C
Hyderabad
April 26, 2024 19: 23 PM
Slider మహబూబ్ నగర్

వాట్ ఈజ్ దిస్: టీచర్లను మాసికంగా వేధిస్తున్న ప్రభుత్వం

teachers

మాస్ కాపీయింగ్ ను ప్రోత్సహించారని నిరాధారమైన ఆరోపణలతో ఒక టీచర్ ను డిస్మిస్ చేయడం, ఏడుగురికి ఇంక్రిమెంట్లు నిలిపివేయడం అన్యాయమని తెలంగాణ యూటీఎఫ్ నాయకులు అన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ వారు ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా TSUTF జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా నాయకులు మహమ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీతాలే కాకుండా జీవితాలు కూడా  ప్రమాదంలో ఉన్నాయని, రోజు కూలీ కంటే అధ్వాన్నంగా మారిపోయాయని వారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్ల లో ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఇలాంటి గడ్డు పరిస్థితి  ఎదుర్కోలేదని, సమైక్యాంధ్ర ప్రభుత్వాల హయాంలో సైతం ఎంతో భద్రంగా ఉన్నారని వారన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఉద్యోగుల, ఉపాధ్యాయుల బతుకులు ఇలా తెల్లారి పోతాయని ఎన్నడూ ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను మానుకోవాలని వారు తెలిపారు. పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఏదైనా ప్రైవేటు సంస్థలకు అప్పగించి నిర్వహించుకోవాలని ఉపాధ్యాయుల పైన ఉన్న ఒత్తిళ్ల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేక 23 మంది విద్యార్థుల మరణానికి కారణమైన అధికారులను, మంత్రులను ప్రభుత్వం సర్వీస్ నుండి ఎందుకు డిస్మిస్ చేయలేదని వారు ప్రశ్నించారు.

ఉపాధ్యాయుల పైన ఉన్న చులకన భావాన్ని విడనాడి అందరినీ సమభావంతో చూడాలని డిస్మిస్ చేసిన ఉపాధ్యాయురాలు అభేధా బేగంను  వెంటనే భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. ఇంక్రిమెంట్ లు నిలుపుదలను వెంటనే రద్దుచేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.

లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టియస్ యుటిఎఫ్ మండల ఉపాధ్యక్షులు రబ్బాని పాష, కోశాధికారి చంద్రశేఖర్, బషీర్ అహ్మద్, పెంట్లవెల్లి మండల ప్రధాన కార్యదర్శి రమేష్, కృష్ణ, పరుశురాం, సూర్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మల్లంపల్లి మండలం ఏర్పాటుపై రాజకీయమా?

Satyam NEWS

హుజూర్ నగర్ లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

Satyam NEWS

పేదలకు ఏడాదిపాటు ఉచిత రేషన్

Bhavani

Leave a Comment